అక్షరాలోచన

సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ.. కవీ..! ఏమిటీ వైనం..
నీవు వ్రాసినదాన్ని.. నీవు మాత్రమే
ఆస్వాదించి.. ఆనందించాలనుకుంటే
పదిమందిలోకీ.. పంపటం దేనికి..?!
నీ గొప్పను చాటుకునేందుకా..!

ఏం రాసావో.. ఎందుకు రాసావో..
బోధపడని అయోమయంలో
పాఠకుడ్ని పడేసి.. గొప్పకవి ననుకుని
మురిసిపోవటం భావ్యమా...

విషయమెంత గొప్పదైనా
నీ విధానమెంత వైవిధ్య భరితమైనా..
అందుకోవలసిన వారికి.. అందక..
పొందవలసిన ప్రయోజనాన్ని.. పొందక..
నిన్ను మాత్రమే అందలమెక్కిస్తే...
అది నిజమైన సాహిత్యమా..?!
నీ కపిత్వ పైత్యముగాక...

‘సాహిత్యం’లో ‘కవిత్వం’
అది ఓ గొప్ప పరిణామ వికాసం
అందులోనూ... వచన కవితది
మరీ గొప్ప వైశిష్ట్యం...
వెర్రితలలు వేసిన నీ విద్వత్తుతో...
అస్పష్టత - సంక్లిష్టతలే..
గొప్పతనాలుగా ఆపాదించి..
విషయ స్పష్టీకరణకు...
అవరోధాల నేర్పరచటం...
సమాజ హితానికే.. సాహిత్యం అన్న
ప్రధాన లక్ష్యాన్ని తుంగలో తొక్కటమే కదా..!
ఛందోబంధాలు - అలంకారాల అందాలు
ప్రతీకాత్మక పద బంధాలు...
ఆస్వాదకులకు మరింత ఆనందాన్నివ్వాలే గానీ...
భావ బోధలో.. ప్రతిబంధకాలై..
చీడలా పీడించి... పీడలా బాధించరాదు కదా..
నీ కవిత్వం...
సుస్పష్ట సుబోధకమై...
అందరికీ అందినపుడే...
నీ సాహిత్యానికి సార్థకత
చేకూరుతుంది.. గుర్తుంచుకో.

-అనే్వషి 7981327110