అక్షరాలోచన

మనసున మనసై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరెంత వారయినా
నిజానికి నీ అంత వాళ్లెవరూ లేరు
అలసి సొలసి కనురెప్పలు మూసినా
కలల ఒడిలో హాయిగా నిదరోయినా
ఆలోచనల అలజడులు చెలరేగినా
భావాంబర వీధులలో పయనించినా
అంతా నీ మహిమే సుమా!
సర్వకాల సర్వావస్థలలో
అందరినీ చైతన్యవంతం చేసే
నిన్ను గమనిస్తుంటే
నింగిలో నిర్విరామంగా
విధులు నిర్వహించే సూర్యచంద్రులు
గుర్తొస్తారనటం అతిశయోక్తి కాదు
ఇంతెందుకు..?
జీవితమంటే నువ్వే
నువ్వు క్షేమంగా ఉంటే నేనూ క్షేమమే.
అనురాగం, ఆనందం, ఆవేదన, ఆవేశం
అన్ని అనుభూతులకు ఆశ్రయం నువ్వే.
ఆపాదమస్తకం మనిషిని కదిపి కుదిపే
అద్భుత శక్తివి నువ్వు కదూ!
పరిమాణం ఎంతైతేనేం
నీ పరిధి గుప్పెడు కాదు సువిశాలం.
కాలగమనమొకటే నీకు తెలిసింది
నీలోన దాగి ఉన్న ‘హృదయానివి’
గుండెన్నా, ఎడదన్నా, మరేదన్నా
మనసున మనసైన నినే్న ప్రేమిస్తా
భద్రంగా ఓ కాపుకొస్తావని.
*

-యిమ్మిడిశెట్టి చక్రపాణి 9849331554