అక్షరాలోచన
నానీలు...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 October 2017
-యన్.కె.నాగేశ్వరరావు 9030360988
పిల్లలిద్దరూ
ఎంత హుషారుగా ఉన్నారో
కానె్వంట్లో చదువుతున్నా
మమీని ‘అమ్మ’ అంటున్నందుకు.
పిచ్చుకలు
సందడి సందడిగా
కల తిరుగుతున్నాయి
‘సెల్’ టవర్ లేదక్కడ.
బజారంతా
ఒహటే బేజారెత్తుతోంది
వర్తకులు పాపం
‘ఎమ్మార్పీ’ రేటుకే అమ్ముతున్నారు.
ఓటర్లు మూకుమ్మడిగా
ఆత్మహత్యా ప్రయత్నం...
నాయకులు ఓటుకు నోటివ్వం
‘లోటు లేకుండా’ చూస్తాం అన్నార్ట.
ఒంటరి ఆడపిల్ల
సెంటర్లో తుంటరి మగ
పిల్లలెందరున్నా
‘్భలేగా’ ఇల్లు చేరిపోయింది.
అమ్మ కళ్లనిండా
నీళ్లు గూడుకట్టాయి
తనని నేను
‘ఓల్డేజీహోం’కి పంపడంలేదని.