అక్షరాలోచన

దినచర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిదురలోతుల్లో
నిండా మునిగిన నేను
అలారం అలికిడికి
చద్దరులోంచి గబగబా
శరీరాన్ని తోడుకొని..
జీవిత ధీమాకు
భస్ర్తీకా ప్రాణాయామము
ఖేల్ కూద్ - ఒంటిపై
స్వేద పుష్పాలను పూయించి
వేపపుల్ల రూపాంతరముగా
నోటిని పుక్కిలించి
పొగలు సెగలు కక్కుతున్న
జెమినీ టీ తాగి
ఏనుగంత బలం..
గీసర్ వేడి ధాటికి కుదేలై
ఉత్తిష్ఠంతు భూతపిశాచ
సంధ్యావందనం గట్రా..
శివుడి నభిషేకించి
చపాతీ రోల్‌ని నోటిలో రోస్ట్
హాంగర్‌కు వేలాడిన
చొక్కాలో చేతులు దిగేసుకొని
కాంతి వేగంకన్నా
వ్యయ ప్రయాసలతో
రన్నింగ్ బస్సెక్కి
అలవాటైన ప్రాణంగా
కంఫర్ట్‌లో ముంచి
ఉతికి ఆరేసిన బట్టలా
దండకు వేలాడుతూ
మిగిలిన నిద్రను...
ప్రతీ సెకను సద్వినియోగం
ఈల సడన్ బ్రేకేయిస్తే
ఉలిక్కిపడి రోడ్డుపై గబాలున...
మే ఐ హెల్ప్ యూ
ఎంత వినయమో..
మెట్లవైపు వేలు చూపిస్తున్న లిఫ్ట్
ఆపసోపాలు పడుతూ
అంతస్తులను..
బాస్ తిట్ల దండకానికి
ఆంజనేయ దండకాన్ని అడ్డువేసి
లక్షాతొంభై కారణాలు చెప్పి
ఆశావహ దృక్పథంతో...
గడియారపు ముల్లు
కంపనపరిమితికి
చెవులు రిక్కించి
రివాల్వింగ్ చైర్లో
గుండ్రంగా తిరుగుతూ
మెలమెల్లగా పడమరకు
వాలిపోతూ - వాలిపోతున్న
దిననాథుడిని - అల్పసంతోషిగా
భానువారంకై ప్రార్థిస్తూ...
దినచర్యగా!!!!
*

-హరిహరనాథ్ శర్మ మడిపల్లి 9603577655