అక్షరాలోచన

విమాన యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ గమనం
మబ్బుల్లో విహారం
కలల సింగిడితో సంచారం
విమానయానం
రాత్రి లేదు, పగలు లేదు
రెండింటిని ముక్కున కరుచుకున్న దూరం
రెండు రెక్కల మధ్య కాలం బందీ
కొండ చిలువ మింగిన ప్రాణుల్లా
తల్లడిల్లడం
పొద్దు గడవడం ఆడపిల్ల సింగారం
ఎదురుచూపులకు గిన్నిస్ రికార్డులు
కళ్లల్లో వత్తులేసుకున్నట్లు
కాలం ముళ్లు ఉరేసుకున్నట్లు
కదలికలు శవం ముందు జాగారంలా
బ్రెడ్ బట్టర్ జాం టిఫిన్లు
రెండు కూరల మధ్య పిడికెడు అన్నం
సయించని నోట్లోబుక్కలు
టైంపాస్ పల్లీలు
టీ, కాఫీ, జ్యూస్‌ల చప్పరింతలు
కూర్చోవడం కూర్చోవడం
గోడ కుర్చీ వేసినట్లు శరీరం
స్వయం ఖైదీలం
క్షణక్షణం కొలతలు, కొలమానాలు
రెక్కలు కట్టేసుకున్న పక్షులం
కలల్ని శాలువాలో కప్పుకొని
ముడుచుకొని కూర్చున్న మునులం
విమానం ఎక్కక ముందు
కళ్లు తెరచుకున్న కలలు
భారమైన నిద్రలో మగ్గుతాయి
విసుక్కుంటూ, నసుక్కుంటూ
కొయ్యగుర్రంపై సవారీ.
* * *
విమానం లాండింగ్ ప్రకటన
రెక్కలు విప్పుకుంటాయి ఆశలు
తీర్పుతో విడుదలైన ఖైదీల్లా ఊరట
విమానాశ్రయం బయట స్వేచ్ఛగాలి
అయిన వారి కలయికతో ఆనందాలింగనం.

-కొమురవెల్లి అంజయ్య 9985411090