అక్షరాలోచన

ఊరంతా నవక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనూరాశి నుండి
మకర రాశిలోకి
సంక్రాంతి సౌందర్య రాశి
అడుగుపెట్టింది వయ్యారంగా!

భారీ కొప్పులో
మేలుబంతి ముద్దబంతులను పెట్టి
పిడికెడు నడుముకు
పసిడి వడ్డాణాన్ని చుట్టి
చిగురుటాకు రస పాదాలకు
నాజూకు వెండి పట్టీలు పెట్టి
గోరింటాకు చేతులతో
అమృత కలశాన్ని పట్టుకొని
చిద్విలాసంగా వచ్చి నిలిచింది
తెలుగు వెలుగు ముంగిట.
ముదితలు లోగిలిలో
సప్త వర్ణాల ముగ్గులు వేస్తూ
కుర్రకారు ఎర్రని భోగిమంటలతో
గిలిగింతల చలికాచుకుంటూ
హరిదాసులు పురవీధులలో
సంకీర్తనల సౌరభాలను వెదజల్లుతూ
గంగిరెద్దుల వివిధ భంగిమలతో
విన్యాసాలు చేస్తూ
అన్నదాతలు గోమాతలకు
గోరంత పసుపుపూసి పూజిస్తూ
కోడెగాండ్రు కోడిపందాలకు
బరులు గీస్తూ
పడతులు పిండివంటలకు ఘుమఘుమలు నేర్పుతూ
సంక్రాంతి లక్ష్మికి సాదర స్వాగతం పలికారు
మంచుతెరలను
సుతారంగా తొలగించుకుంటూ
సంక్రాంతి జవ్వని తెలుగు గడపలోకి
అనుకున్న అతిథిలా కుడికాలు పెట్టింది
ఇంటింటా సంక్రాంతి -
ఊరంతా నవక్రాంతి.

-జి.సూర్యనారాయణ 9704784744