అక్షరాలోచన

మరో కోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నిసార్లు నిన్ను నువ్వు తవ్వుకోవటం కూడా మంచిదే
జారిపడ్డ కన్నీళ్లని, తుడుచుకుపోయిన జ్ఞాపకాలని
మోసుకు తిరగకుండా అక్కడికక్కడే వొదిలేసేయవచ్చు

చాలాసార్లు నీకు తెలియకుండానే నీలోని ఆత్మతో సంభాషిస్తావు
వౌనంగా నీలో వెలితిని పూడ్చుకోవటానికో
లేదు మరో మొక్కగా మారి అస్తిత్వాన్ని నిలబెట్టుకోడానికో

ఎన్ని నవ్వులను మెదడు నుంచి పెదాల పైకి జారవిడిచి
నిర్లిప్త ప్రపంచంలో వొంటరి సైనికుడిలా యుద్ధం చెయ్యలేదు
మరి ఎవరు చెప్పారు నీకు దేహం నుంచి నువ్వు విడిపోతున్నావని

నిద్రలేని రాత్రుల నన్నింటిని కుప్పగా పోసి తగలబెట్టినాక
కలల గురించి కలవరించటం నీ కన్నులు నీకు చెప్పాయా
మరి ఏదో ఆలోచన నీ తలకు చుట్టుకొని
బంధాల దారాలను ముడివేస్తూ పోతుంది...

బానిసత్వాన్ని నీలో వొంపుకొని తడబడిన అడుగులతో
దారి తప్పిన బాటసారిలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ
సమాధానం లేని ప్రశ్నలా... ప్రతిరోజు...
నిన్ను నువ్వు బహిర్గతం చేసుకుంటావు

*************************

వర్ణమాలలో వెలుపల

-అమర్లపూడి కళ్యాణ్‌కుమార్
8341136796
నీవు రాసిన వర్ణమాలలో
నాదెన్నో అక్షరమో తెలియక
తరతరాలుగా నే వెదుకుతూనే ఉన్నా
మనిషికీ మనిషికీ సంబంధం అనే
సమాసంలో
నా స్థానమెక్కడో చూసుకుంటే
ఊరికి వెలుపలే అని తెలిసి
సంబంధం తెగిన మానవత్వాన్ని
అలంకరించిన నీ అ‘జ్ఞానపు’
ఛాందస ఛందస్సుకు
నా జాలి చూపుల లిపి తప్ప
చేతల వికృతి చూపలేను
ఎందుకో తెలుసా
నాకు గుర్తుంది నేను మనిషినని
మీ మనువు రాసిన
అతుకుల ఆత్మకథకు
అంతూపొంతూ లేని
అనవసర కథనాలకు
జీవితకాలపు నిరసన పురస్కారం
ఇవ్వకుండా ఉండలేక పోతున్నాను
విషయం, విజ్ఞానం లేని ‘ఆ’ అసంబంధ
అక్కరకే రాని
అరసున్నా గ్రంథాలకు
సంధి సూత్రం రాయాలన్నా లేదుగా
అరువు తెచ్చుకున్న పర్యాయ పదాల్లాంటి
సంప్రదాయాలు
తాత్పర్యమే లేని పద్యంలాంటి
విష సంస్కృతిని ఎంత చిలికితేనేం
పరిపూర్ణ శూన్యానే్నగా సున్నా అంటాం.

************************

నిఖార్సయిన తిరస్కారం

-నాశబోయిన నరసింహ
9542236764

ఒకప్పుడు...
నీ జ్ఞాపకాల జాడ కోసం
విశ్వమంతా వెతుకుతూ
ఉనికి కానరాక
ఊహల్లో అనే్వషిస్తూ
అప్పుడప్పుడు...
నీ అందెల సంగీతం
నీలి కురుల సాహిత్యం
నా అం‘తరంగాల’
శ్రోణి ద్రోణుల పరంపర
అలజడి బీజమై అంకురించినా
నా ఎదలో సంవేదన దాచుకుంటూ
ఇప్పటికీ
వెనె్నల జలపాతానివి
నా ఆరాధనా వేదనను
నీ వాదన ప్రశాంతపరచకున్నా
రంగుల హరివిల్లువి నీవే
నీ మది గెలిస్తే విజేతని మాత్రమే
నీ ప్రేమ అసమ్మతి తాకిడి
నాలో రగిల్చిన కసి
కఠోర సాధనా వృక్షంగా ఎదిగి
స్వప్న సౌధం సాకారమైనందుకు
ఎప్పటికీ...
నా మనోహర శిల్పమా!
నీ ఆగమనం కోసం
ఎదురుచూసే సుప్రభాతం
నా ఆదర్శ ప్రేమ దీపమా!
నిఖార్సయిన
నీ తిరస్కార పిల్ల తెంపర
నిజమైన మనోవిజయానికి
శ్రీకారమైనందుకు.

****************

నన్ను ఏడ్వనీ

-గవిడి శ్రీనివాస్
9966550601

నీవు గుర్తొచ్చినపుడల్లా
నా కళ్లల్లోంచి
కన్నీళ్లు వర్షంగా రాలుతాయ్
నేను ఆకాశం వైపు చూస్తున్నపుడు
మబ్బుల్లోంచి చేతులు చాచి పిలుస్తావ్
నేను పువ్వు వైపు చూస్తున్నపుడు
పువ్వులో నవ్వుతూ కనిపిస్తావ్
నేను గోడను తాకినపుడు
‘ఏం చేస్తున్నావ్’
ప్రశ్నను సంధిస్తావ్
కానీ నీ భౌతిక సహవాసం ఒక భ్రమే!
నన్ను ఏడ్వనీ
నా హృదయం గడ్డకట్టుకు పోయేవరకూ.

-పుష్యమి సాగర్ 9032215609