అక్షరాలోచన

హైకూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణం మరిచా
అలల్తో ఆడుకుంటూ-
తల్లి మరణం
అంధభిక్షుకి-
రెండుసార్లు తడిమి
చిల్లరిస్తోంది.

చలి సాయంత్రం-
ఇంటి తాళం ముందు
దిగాలు కుక్క

మహా విగ్రహం
అరచేతి సందుల్లో
బల్లి గుడ్లు

కాసేపు ఆట..
కాసేపు భిక్షాటన..
వీధి బాలురు
చలిగాలులు
పొత్తిళ్ల బిడ్డ చెవుల్ని
మూస్తోంది తల్లి

ఎండాలటేళ-
పూలమ్మి స్వేదం మధ్య
ఓ పూలరేకు

పాడుబడ్డిల్లు-
పెరటి పూల మీద
సీతాకోకలు
చీకటి ముసురు
గండుచీమ మోసుకెళ్తోంది
నిర్జీవ చీమను

తన వెలుగులో
తనే దారి చూసుకుంటూ-
చలి మిణుగురు
***********************

అంతా సొంతం కావాలని
ఎప్పుడూ - మనిషి
ఆరాట పడుతున్నాడు
అందని ద్రాక్షనే చూస్తున్నాడు

మనిషిని మాణిక్యంలా
చూడాలన్న దేవుడికే
నామాలు పెడుతున్నాడు
కళ్లు కప్పుతున్నాడు

సర్వాంతర్యామితో
పరాచికాలా - పిల్లచేష్టలా
సర్దుకుపోతున్న వాడి ముందా
తోక జాడింపు - కాలం కత్తిరిస్తుంది

కాల ప్రవాహంలో- సగం జీవితం
రేయి రాహువులా మింగింది
పగలుందని ధీమాగా వున్నావు
మిగిలింది - కేతువు కబళించింది

సొంతం సొంతం అనుకుంటూ
భ్రమలో బ్రతుకుతున్నావు
పైసల ప్రవాహంలో కొట్టుకుపోతూ
దానవుడిలా - విర్రవీగుతున్నావు
సొంతం అనుకున్నది - శోకానికి దారి
అంతా కావాలనుకుంటే - కన్నీటి కడలియే.
**********************

నువ్వు నాకు కావాలి

-పోడూరి శ్రీనివాసరావు
9849422239

నేను నీకవసరం లేదు
కానీ... నువ్వు నాకు కావాలి
నేను నీకు విషతుల్యం
కానీ.. నువ్వు నాకు అమృతం
నాతో మాట్లాడడమంటే
నీకు కర్ణకఠోరం...
కానీ.. నీ పలుకులే, నాకు వీణానాదం
నా ఉనికే నీకు కంపరం
కానీ.. నీవు ఎదురుగా ఉంటే
నాకు నందనవనం
నా ఊపిరే నీకు ఎడారిగాలి
కానీ... నీ నిశ్వాసమే నాకు హిమనగం
నా ఆలోచనే నీకు తృణప్రాయం
కానీ.. నీ తలపులే నాకు పూల సౌరభం
నా ముఖం చూస్తేనే నీకు అసహ్యం
కానీ.. నీ వదనారవిందమే నాకు చంద్రబింబం
నా తోడి నడయాడే అడుగులే
నీకు కంటకప్రాయాలు
నీ.. తోడి అడుగులే నాకు
మెత్తని తివాచీలు
నాతో ఉండాలనే ఊహే నీకు నరకప్రాయం
నీతో.. ఉండాలనే తలపే, నాకు నాకసమానం
నన్నింతగా తృణీకరిస్తున్నా
నీతోనే.. నా జీవితమనుకున్నా
ప్రాణంకన్నా మిన్నగా
నినే్న ప్రేమిస్తున్నా...
అయినా
నేను నీకవసరం లేదు
కానీ.. నువ్వు నాకు కావాలి
నువ్వే నాకు కావాలి
నీ తలపులే నాతో నడయాడాలి.

-పి.శ్రీనివాస్‌గౌడ్ 9949429449