అమృత వర్షిణి

యథాశ్రోతా.. తథా వక్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్రోక్త వరవర్గ సప్తస్వర నిబద్ధ/ గీత ప్రపూత సంగీతరీతి/ భారతీ ముఖసిత భానోల్లసిత బింబ/ శీతల జ్యోత్స్న సంగీత సుకళ/ విశ్వమోహనకర వీణానినాద స/ మ్మేళనా కవిత సంగీత లలిత/ కమనీయ నవరస గాన మంజుల సార/ నిర్ఘరీ వారి సంగీత ధార/ సరస సంగీత సురనదీ స్వాదుజలము/ చిలికినట్లైన మోడుమాకులు చిగుర్చు/ మరణదశనున్న జీవమ్ము, మరల బ్రతుకు/ నట్టి సంగీత విద్య నభ్యాసపరచి విశ్వగాయక/ విఖ్యాతి వెలయవలయు’
ఆదిభట్ల నారాయణదాసు గారి పరంపరలో ప్రఖ్యాత హరికథా విద్వాంసుడు అమ్ముల విశ్వనాథంగారు గుంతకల్ రైల్వేస్టేషన్‌లో, 50 ఏళ్ల క్రితం కలుసుకున్నప్పుడు చెప్పిన పద్యమిది. ఎవరు రాశారో తెలియదంటూ కమ్మగా పాడి వినిపించారు.
ఎవరైతేనేం? పద్యం ఎంతో హృద్యమై మనసుకు హత్తుకుంది. సుస్వర సంగీత మాధుర్యాన్ని అద్భుతంగా వర్ణించిన ఈ పద్యాన్ని పదిలంగా దాచి పెట్టుకున్నాను. కళాకారులకు ఏ సత్కారాలో, సన్మానాలో జరుగుతూంటాయి. అందులో సంగీత విద్వాంసులకు చేసే సన్మానాలను గురించే చెప్పుకోవాలి. ఊళ్లో ఏ ప్రముఖుడినో, పలుకుబడిగల పెద్దలనో, ఏ రాజకీయ ప్రముఖులనో పిలుస్తూంటారు. సాధారణంగా అటువంటి వారికి ఏమున్నా లేకపోయినా సంగీత గుణం కొంచెమైనా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. అదేం ఖర్మమో? కొందరిలో అది మినహాయించి మిగతా లక్షణాలన్నీ వుంటాయి. ఆ మధ్య ఇటువంటి సన్నివేశం చూసి మీతో పంచుకోవాలనిపించింది. విశిష్ట అతిథిగా విచ్చేసిన వారిలో కొందరికి పట్టుమని పావుగంట కూడా సంగీతం వినే ఓపికుండదు. పోనీ పొరబాటున కూర్చున్నా రాగాలాపన ఆరంభించిన కాసేపటికి పక్కవాడితో బాతాఖానీకి దిగే ప్రబుద్ధులు కొందరు. సహజంగా విద్వాంసుడి దృష్టి వచ్చిన అతిథిపైనే ఉంటుంది గదా?
లోలోపల బహుశా తన పాటను విమర్శిస్తున్నారేమో అనే అనుమానం. అన్నింటినీ అధిగమించి చూసీ చూడనట్లుగా ఉంటూ ఎలా పాడతారో ఆ భగవంతుడికే తెలియాలి.
సంప్రదాయ సంగీతమంటే, తెలియని వారే సంగీతాన్ని గురించి మాట్లాడే ప్రయత్నం చేయటం యింకా ఆశ్చర్యం కలిగించే విషయం. అంతేనా?
ముసిముసి నవ్వులతో వేదిక నలంకరించి తెలిసీ తెలియక మాట్లాడేవారి చిలకపలుకులకు జనం హర్షధ్వానాలు పలకటం ఇంకా శోచనీయం. దివ్యమైన సంగీతం ఈ వేళ తామస విద్యగా పరిణమించింది.
సాత్త్విక గానానికి ఇతరులతో పనిలేదు. ఎవరికి వారే సాధించు కోవలసినది. సంసార దుఃఖాలలో మునిగిన వారికిదే కావాలి. నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్న చందంగా మన దైనందిన జీవితాల్లో సంస్కారవంతమైన సంగీతాభిరుచి తగ్గిపోతోంది.
సంప్రదాయ సంగీతం వినాలనే ఆసక్తి ఉన్నా లేకపోయినా, సంగీతం పేరు చెప్పగనే ప్రతిస్పందించే వదాన్యులైన దాతల ధర్మమాయని మన ఆంధ్ర ప్రాంతంలో మినుకు మినుకుమంటూ అక్కడక్కడ ఏవేవో సంగీత సభలు నడుస్తూ, శక్తివంచన లేకుండా సంగీత సేవ చేస్తూనే ఉన్నాయి.
వెనకటి తరంలో సంప్రదాయ సంగీతం పట్ల ప్రజల్లో మంచి అభిరుచి కలిగించాలనే తాపత్రయంతో ఆస్తులు కూడా అమ్ముకుని సభలు నడిపిన వారిని ఎరుగుదును. సంగీతాన్ని నమ్మిన వారి జీవితాలు వేరు. అమ్ముకునేవారి మార్గం వేరు.
సంగీతమన్నా సాహిత్యమన్నా కేవలం సినిమా పాటలే అనే భావనతో వున్న వారికి సంప్రదాయ సంగీత విలువలను గురించి ఎంత మొత్తుకున్నా ప్రయోజనం సున్నా. ఏళ్ల తరబడి గురుముఖంగా నేర్చుకుని శ్రద్ధ్భాక్తులతో సాధన చేస్తేనే అప్పటికప్పుడు మనసులో పుట్టిన భావాలతో రాగం పాడటం రాగభావంతో స్వరాలు సృష్టించి లయాత్మకంగా పాడటం వీలవుతుంది. ఒక్కోసారి ఎంత పాడినా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ పాడేది సంప్రదాయ సంగీతం. గ్రామఫోన్ రికార్డు మాదిరిగా ముక్కున పట్టేసి ఊదేసేది కాదు.
ఎదురుగా కూర్చుని వినే శ్రోతల రసజ్ఞతను బట్టే విద్వాంసుడి ప్రతిభా సామర్థ్యాలు ద్విగుణీకృతమవుతాయి. కొందరు సంగీత కచేరీలకు వచ్చి కూర్చుంటారు గమనించండి. ముఖంలో ఎటువంటి ప్రతిస్పందన కనిపించదు. సంగీతానందాన్ని అనుభవిస్తారో లేదో తెలియదు. కానీ సంగీతానే్న ఆశ్రయించుకున్న విద్వాంసులున్నారు చూడండి. వినే వారికంటే ఎన్నో రెట్లు శ్రమపడాలి. ప్రాణాలు పెట్టి ఎంతగా పాడి మెప్పించాలని భావించినా ఆ రోజు గాత్రం సహకరించకపోవచ్చు లేదా సహకరించే ప్రక్కవాద్యాలు బలహీనంగా ఉండవచ్చు. ఇన్ని అవాంతరాలు దాటి ‘శభాష్’ అనిపించుకోవటం నిజంగా వారికి అసిధారావ్రతమే.
ఆత్మోద్ధరణకు మాత్రమే పాడుకునే సాత్త్విక గాన సంపన్నులకు అసలు అవతలి వారితో సంబంధం ఉండదు. సత్కారాలూ సన్మానాలూ ఆశించరు. ఐహిక వాంఛలుండవు. భక్తి వైరాగ్యాలే వారికి ప్రధానం. వారికదో యోగం. అదో తపస్సు. త్యాగరాజాది నాద యోగులందరికీ లభించినది ఇదే.
తనని ఆశ్రయించుకుని సంగీతం మీద భక్తిశ్రద్ధలున్న శిష్యగణానికి సంగీత విద్యాదానం చేసి వాళ్లను తరింపజేసి తమ జన్మసార్థకం చేసుకున్న మహనీయులున్నారు. భృంగి, పరమశివుడు, మారుతి, అగస్త్యుడు, మతంగుడు, నారద తుంబురులు వంటి నాదోపాసకులను ఆదర్శంగా భావించి పాడుకున్న నాద యోగులు లౌకిక ప్రపంచంలో అర్థకామాలతో మునిగి, సంగీతాన్ని వినోద వస్తువుగా భావించే వారిని కనె్నత్తి చూడవలసిన అవసరముండదు.
‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్/ సొమ్ములు గొన్ని పుచ్చుకుని సొక్కి, శరీరము బాసికొలుచే/ సమ్మెట వాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పె నీ/ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధింబుగన్’ అంటాడు పోతన. దీనికి ఎంతో దమ్ము, ధైర్యమూ ఉండాలి. భగవత్ప్రేరణ కూడా వుండాలి. అహంకారం మూర్త్భీవించిన వారు మహారాజులైనా అధములే. అటువంటి వారి సేవ నఱకప్రాయమని బాహాటంగా ప్రకటించిన మహనీయులను ఆదర్శంగా భావించేవారి ఆలోచనలు చౌకబారుగా వుండవు.
అరుణాచల రమణులు భగవాన్ రమణ మహర్షిగా పిలవబడటానికి కారణం ‘కావ్యకంఠ గణపతి ముని’. ఈయన చాలా అసాధ్యుడు. తన 12వ ఏటనే కావ్యరచనలో దిట్ట అనిపించుకున్న కవి చక్రవర్తి, మహామంత్ర జప నిష్ణాతుడు.
1907లో కార్తీక దీపోత్సవానికి అరుణాచలం వెళ్లి, భావోద్వేగంతో కొండమీద వున్న విరూపాక్ష గుహలో కూర్చున్న బ్రాహ్మణ స్వామి రెండు పాదాలూ పట్టుకుని వేదాంత శాస్త్రం సర్వం గ్రహించాను. మంత్రజపం తృప్తిగా చేశాను. కానీ యింతవరకూ ‘తపస్సు’ అంటే ఏమిటో తెలియరాలేదు. స్వామీ! శరణాగతుణ్ణి. కరుణించి తపస్స్వభావాన్ని తెలుపమని వేడితే, ఈ ‘నేను’ అనే భావం ఎక్కడ నుంచి పుట్టుతోందో గమనించు. మంత్ర జపం, మంత్ర నాదం ఎక్కడ ఉద్భవిస్తోందో పరిశీలిస్తే మనస్సు అందులోనే లీనవౌతుంది. అదే తపస్సు అని మెల్లగా చెవిలో చెప్పారు.
భగవాన్ రమణ మహర్షికి ప్రణామాలర్పించి పాదాలపై పడ్డారు కావ్యకంఠులు. ఆ పేరుతోనే పిలవాలని శిష్యులకు చెప్పారు. ఆ పేరే ప్రసిద్ధమైంది. సంగీతం కూడా తపస్సే. ఒక విద్యగా పాడటానికి గానీ, వాయించటానికి గానీ దిగటం సామాన్య సాహసం కాదు. గారెలు వండటానికి బొటనవ్రేలుంటేనే సరిపోదు. తలలోని మెదడు, దేహంలోని రక్తమాంసాలు రోజూ కరిగిపోయేలా కష్టించి సాధన చేసే, వారిదే సంగీత తపస్సు.
అటువంటి విద్వాంసుల గానం వినటానికి కూడా సంస్కారం కావాలి. అలవోకగా అనుకరించి పాడే పాటకూ అనుష్టానం చేసి పాడే దానికీ లేదా తేడా? కోట్లాది మహాజనంలో మహాపురుషులెందరుంటారు? నాదయోగులు కూడా అంతే.
ఓ సంగీత దర్శకుడు కేవలం స్వరాలతో ఓ పాట చేస్తే మహాజనం పోగై చప్పట్లు కొట్టగా చూశాను. అదో ప్రజ్ఞ. సర్కస్సులో తీగ మీద నడిచే మనిషిని చూసి నివ్వెరబోవడం లాంటిదే అదీను. అది పాట. ఇది ఆట. ప్రజ్ఞకూ పాండిత్యానికీ తేడా ఉంది. పది కాలాలపాటు పదిలంగా మనసులో స్థిరపడిపోయేది పాట. అప్పుడు చూడగానే ఆశ్చర్యమనిపించేది ఆట.
‘్ధనము కావలెనన్న దంభములు, మోసములు/ ఇచ్ఛకముల్ సేయవలె’ నంటాడో కవి.
ప్రతిభా సామర్థ్యాలు కలిగి ధారాళంగా స్వతంత్రంగా పాడగలిగే వారికి లభించే తృప్తి అనుకరణలో ఉంటుందా? రియాలిటీ షోల పేరుతో జరుగుతున్న ‘మాయ’ ఇదే.
కాశీలో ‘గణేశభావే’ అనే హిందూస్థానీ సంగీత విద్వాంసుడికి కలలో శ్రీరాముడు కనిపించి, తిరువయ్యారులో భక్తశిరోమణియైన ‘త్యాగరాజ’నే భక్తుడొకడున్నాడు. దర్శించవలసినదిగా చెప్పగా, వెళ్లి త్యాగయ్యను దర్శనం చేసుకున్నాడు.
మహానుభావా! రసికశిఖామణీ! నా ఆశ తీరేలా నా పేరునూ, నా కీర్తనలనూ దూర ప్రాంతాలలో కూడా వినిపించేలా చేసిన నీ రుణాన్ని నేనెలా తీర్చుకోగలనయ్యా! అది నా తరమా? భక్తిలేని కవులకు భావం తెలియదు. (మహారచయితలమని చెప్పుకుని ఎంత రాసినా అది తూకానికే ఉపయోగపడతాయి.)
అటువంటి వాటివల్ల ఏ ప్రయోజనం లేదని, త్యాగయ్య కీర్తనల వల్ల, భుక్తి ముక్తీ రెండూ కలుగుతాయని చెప్పావు’ అని పరమానంద పడ్డాడు. (దాశరథీ! నీ ఋణము తీర్ప నా తరమా) ఎక్కడ కాశీ? ఎక్కడ తిరువయ్యారు? పైగా హిందూస్థానీ సంగీతం పాడే వాడికి శ్రీరాముడు కలలో కనిపించడం ఏమిటి? భక్తులు భావాలు పంచుకుంటారనటానికి ఇదో నిదర్శనం. అంతే.
ఊగని తల ఉంటేనేమి? పోతేనేమి?
రాజదర్బారులో ఆస్థాన గాయకుడు అద్భుత గానానికి మహారాజు తన్మయత్వంతో అర్ధనిమీలిత నేత్రాలతో వింటున్నాడు. మధ్యమధ్యలో గాయకుణ్ణి అభినందిస్తూ ప్రశంసా సూచకంగా మధ్యమధ్య తల ఊపుతున్నాడు.
రాజుగారు తల ఊపినప్పుడల్లా సభలో కూర్చున్న శ్రోతలు కూడా అర్థమైనట్లు తలలూపుతున్నారు. ఆయన ‘శభాష్’ అంటూంటే వాళ్లూ శహభాష్ అంటున్నారు. ఇది గమనిస్తున్న మహారాజు-
‘వీళ్లు నిజమైన సంగీత ప్రియులు కాదు. నా మెప్పు పొందడానికే తలూపుతున్నారు’ అనుకుని ‘తల ఊపకుండా వినండి. ఊపారంటే తల తీయించేస్తాను’ అని శ్రోతలను హెచ్చరించాడు.
మళ్లీ గాయకుడు పాడటం మొదలుపెట్టాడు. సభికులు తలలూపకుండా బెల్లం కొట్టిన రాయిలా స్థాణువులై వుండిపోయారు. ఆహాలూ లేవు, ఓహఓలూ లేవు. కానీ ఒక్క ‘తల’ మాత్రం మధ్యమధ్యలో ఆ గానానికి తల ఊగుతోంది.
మహారాజు గమనించి ఒక్కసారి గర్జించాడు. ‘ఎంత పొగరు నీకు? ఏం! చావదలచుకున్నావా?’
ఆ శ్రోత ఎంతో వినమ్రతతో నిలబడి చేతులు జోడించి ‘మహారాజా! రాళ్లు కరిగించే గంధర్వగానం వింటున్నప్పుడు ఊగని తల ఉంటేనేమి? తెగిపడితేనేమి? తల తీయించేయండి మహారాజా!’ అన్నాడు.
మహారాజు విస్తుబోయి ‘సంగీతాన్ని నిజంగా విని ఆనందించగల రసికుడవంటే నువ్వేనయ్యా!’ అని ప్రశంసించాడు.

- మల్లాది సూరిబాబు 90527 65490