అమృత వర్షిణి

‘ఆశా! నా ప్రాణ సఖీ! దగ్గరగా రా!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

64లక్షల జీవరాశిలో భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం ఒక్క మనిషికే. ఎక్కడో సర్వసంగ పరిత్యాగులకు తప్ప నిన్నటి నిరాశకు, రేపటి ఆశల మధ్య వర్తమానంలో జీవిస్తున్నామనే స్పృహలో బ్రతికేది మనమే. ఒక విధంగా యిదో వరం. మరో విధంగా శాపం. తల్లిదండ్రులతోనే ఈ ఆశాపాశాల వలయానికి అంకురార్పణ మొదలౌతుంది. పుట్టబోయే వారి కోసం, నవమాసాలూ మోసి, తిండి సుఖం నిద్ర సుఖం లేకపోయినా, భవిష్యత్తు బంగారంలా ఉంటుందని కలలు కనేది ముందుగా కన్నతల్లే. సంసారం పెరగాలిగా? శాఖోపశాఖలై వంశం వృద్ధి చెందాలనే ఉబలాటం, పెరిగీ పెరిగీ క్రమంగా ఆ.. ఆశల పందిరి పెద్దదై వటవృక్షంలా తయారవుతుంది. అవ్వాలనే ఆశాపాశ బంధం ఏర్పడేది. అసలు కథ కూడా ప్రారంభమయ్యేదిక్కడి నుంచే.
ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా చేస్తున్నంత కాలం ఏ ఇబ్బందీ ఉండదు. నిజానికి ఇందులో దొరికే తృప్తి కంటే ఏ ప్రయోజనాలూ అధికమైనవి కావు. ఇందులో యజమాని, అతనిలోని శరీరకోశాలు, ఇంద్రియాలు, మనస్సు అన్నీ ఓ చిత్రమైన అనుభూతిని అనుభవిస్తాయి.
మేం ఇతడి చేత ఎందుకు ఎలా వినియోగబడాలో అందుకే వినియోగింపబడుతున్నాం కదాయని తృప్తి పడతాయి. ఒకవైపు అటు మనస్సుకూ యిటు ఇంద్రియాలకూ సరైన పొంతన ఏర్పడి అన్నీ సవ్యంగా సాగిపోతున్నంత కాలం ఆ కర్మాచరణం ఓ గానంలా సాగిపోతుంది. అటువంటి గానాన్ని ఆలపించడానికే మనం ఈ భూమీదకు వచ్చాం. మనం ఆలపించాలి. మిగిలిన వారు ఆలకించాలి. అదే జీవితానికి సార్థకత. ధన్యత.
దైవం మనకు మనస్సు, శరీరంతో బాటు కర్మాచరణకు కావలసిన కర్మేంద్రియాలు, జ్ఞానం కోసం జ్ఞానేంద్రియాలూ ఇచ్చాడు. మనస్సుతో ఈ రెండు గుంపుల చేత పని చేయించగల బుద్ధినిచ్చాడు. పైనుంచి అందర్నీ చూస్తూ గమనించేవాడు, కర్మాచరణ ఎలా చేయమన్నాడు? ఫలితాన్ని ఆశించకుండా చేయమన్నాడు. ఇది చెప్పినంత సుళువు కాదు.
మేం కోరిన ఫలితం లభిస్తేనే పని చేస్తానంటాడు. లేకపోతే చేయనంటాడు.
ఫలితం ఇలా ఉంటే బాగుంటుందని దేవుడికే ఉచిత సలహాలిస్తాడు.
ఆశించిన ఫలితం రాలేకపోతే కృంగిపోయే వాళ్లుంటారు. చూడండి.
నిజంగా చెప్పాలంటే పనిని చేయటం వరకే మన ధర్మం. ఫలితం విషయంలో మనకే హక్కూ లేదు. ఏమని అడుగుతాం? అలా భావిస్తే నష్టమే తప్ప లాభం ఉండదు. నిజాయితీతో కల్మషం లేకుండా చేసే పనికెంత ఫలితమివ్వాలో పైవాడికి తెలుసు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే గీతలో చెప్పాడు. (కర్మణ్యే వాధికారస్తే)
పని ఎగ్గొడుతూ ఫలితం కావాలంటే ఎలా? అందుకే ఫలితం మీద ప్రత్యేకమైన దృష్టి లేని నాడు తాను చేస్తున్న పనికి పరిపూర్ణమైన న్యాయం చేయగలుగుతాడు.
చిత్తశుద్ధితో మనం చేసే పనులకు దైవం మనకు కనిపించకుండా మనక్కావలసినవన్నీ సమకూరుస్తాడు.
స్వధర్మాచరణలో నిరంతరం సాగిపోయే వాడికి అవాంతరమంటూ ఉండదు.
ఫలితాలను గురించి గానీ జీవితాన్ని గురించి గానీ, భవిష్యత్‌ను గురించి చింతలుండవు.
సుఖదుఃఖాల స్వరూప స్వభావాలను గమనించండి!
సుఖం మన ఇంద్రియాలకు మనస్సుకూ ఆనందాన్నిస్తే, దుఃఖం నీరసింపచేసి ఏ పనీ చేయనివ్వదు. చేసినా ఫలితమేమీ ఉండదు.
ఈ దుఃఖంలో మళ్లీ రెండు రకాలు. కాల నిర్ణయానుసారం ప్రాప్తించే దుఃఖం, మనకు మనంగా సృష్టించుకునేది దుఃఖం.
మనం చేసే పనుల వల్లనో అవకతవక విధానాలతోనో లభించే దుఃఖానికి కారణం మనమే! ఆత్మపరిశీలన అప్పుడే అవసరం. అలా చేసిన పనులు మళ్లీ చెయ్యం కదా! లోకంలో మనం అనుకున్నవి కొనే్న జరుగుతాయి. కొన్ని జరగవు. అంతే! జరిగితే దైవం ఉన్నాడనిపిస్తుంది. జరక్కపోతే ఇంత నమ్మినా ఇదేమిట్రా! అనే బాధ కలుగుతుంది.
అడిగేవన్నీ దైవం ఇచ్చేసుకుంటూ పోతే కొన్నాళ్లకు ‘ఆ దైవాన్ని నేనే. జనులారా! మీరంతా నా దగ్గరకు రండి. మీ కోరికలు నేనే తీరుస్తాననే దిక్కుమాలిన వక్రబుద్ధి బయలుదేరి మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించేస్తాడు మనిషి. ఏవేవో కుహనా సిద్ధాంతాలతోనూ, వాదాలతోనూ కొన్ని పీఠాలేర్పరచుకుని, మనుషులను చేరదీసే బురిడీ బాబాలను, సాధు సంగ పరిత్యాగులను చూస్తున్నాం కదా! మూలాధారుడైన పైవాణ్ణి పక్కనబెట్టి పక్కవాడో కనిపించినవాడినో నమ్ముకుని ఉద్ధరిస్తాడనుకోవటమే అజ్ఞానం. నేను క్షమింపబడెదనుగాక!
లోక వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. నాకే బాధలు! అందరూ సుఖపడిపోతున్నారనుకుంటారు కొందరు. కష్టాలన్నీ తమకే అని వాపోతూంటారు.
సమస్యలు లేని కుటుంబాన్ని ఒక్కటి చూపించండి. చిన్నా పెద్దా తేడా తప్పితే సంక్లిష్టమైన స్థితిలో లేనివాడంటూ ఉండడు. అది శారీరకం కావచ్చు. మానసికం కావచ్చు. ‘అన్యధా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ’ అనే సర్వస్వ శరణాగతి కంటే దీనికి విరుగుడు కానీ దగ్గర దారి కానీ లేదు. త్యాగరాజంతటి వాడు, ప్రారబ్ధాన్నీ కాస్తో కూస్తో అనుభవించలేక పోలేదు. నమ్ముకున్న దైవంపై భారం పెట్టేసి బ్రతికాడు. పాలముంచినా! నీట ముంచినా దైవానికే ఆ బాధ్యత వదిలిపెట్టాడు. తనకు చాతనైన సంగీత విద్య ఎలాగూ నీడలా తనతోనే వుంది. సుఖంగా పాడేస్తూ బ్రతికాడు.
స్వరావళి - ఝంపె తాళం - త్యాగరాజు
పల్లవి: ప్రారబ్ధ మిట్లుండగా ఒరులనన
పనిలేదు నీవుండగ ॥
బాలగుణశీల జన పాల భరిత కృపాల
వాల కాలాతీత శూలధర వినుత నా ॥
ఉపకారినేనైతే అపకారులయ్యేరు
కృప జూచితే మిగుల నెపము లెంచేరు
చపలచిత్తులు భక్త లేషులై నను జూచి
శత్రులయ్యేరు శ్రీ త్యాగరాజ వినుత ॥
నాలుగు దశాబ్దాల క్రితం ‘స్వరావళి’ రాగంలో ‘సంగీత కళానిధి’ డా.పినాకపాణిగారు స్వయంగా నేర్పించిన ఈ కీర్తన ఎంత చిన్నదో, దీని అర్థం అంత పెద్దది.
మనలా మన చుట్టూ జనం మాట్లాడరు. వ్యవహరించరు. లోపలొకటి పైన ఒకటి. అంతా మాయే. ఆ మాయను మాయతో జయించటం ఒక పద్ధతి. ఎదుర్కొనే శక్తినివ్వమని దైవాన్ని ప్రార్థించటం మరో పద్ధతి.
రెండోదే అందరికీ ఆచరణయోగ్యం. ‘దేవా! నేను మార్చలేని పరిస్థితు’లను అంగీకరించుటకు ప్రశాంతత నిమ్ము! మార్చగలిగిన పరిస్థితులను మార్చుకొనుటకు ధైర్యము నిమ్ము! పై రెంటికీ గల తేడా తెలుసుకొనుటకు వివేకము నిమ్ము.
బయటకు బయలుదేరుతూ బోర్డు మీద రాసుకున్న ఈ మాటలు ఓసారి చూసి వెళ్తాను.
నా శ్రేయోభిలాషి మిత్రుడొకడు నాకందించిన అభయ హస్తం వంటి ఈ మాటలే వౌనంగా నేను చేసే ప్రార్థనకు మారు రూపాలు. ప్రపంచ ప్రసిద్ధమైన ఈ ప్రార్థన లేదా వేడుకోలు ఎక్కడ ఎలా ఎందుకు ఎవరి కోసం పుట్టిందో మరో సందర్భం ముచ్చటిస్తాను.
అంతరంగంలోని అనుభూతుల్ని అక్షరాలుగా మార్చి సంగీత మధువుతో నింపగల సవ్యసాచి.. కళాప్రపూర్ణ డా.బాలాంత్రపు రజనీకాంతరావు ఎప్పుడో కుర్మియాంగ్ రేడియో కేంద్రంలో పని చేసిన రోజులలో ఒంటరిగా కూర్చున్నప్పుడు వ్రాసుకున్న పాట, మా గురువైన వోలేటి వెంకటేశ్వర్లు గారు ఆకాశవాణి కోసం పాడారు. చాలా ఏళ్లైంది. హిందుస్తానీలో ‘గావత్’ అనే రాగంలో రజనీయే స్వరపరిచారు. ఈ ఉదయం పాడుకుంటూ నా అనుభూతి మీతో పంచుకోవాలనిపించింది.
‘ఆశా! నా ప్రాణసఖీ ప్రభాత తారా పాణి గృహీతి దారా, నా మధుర భావధారా దగ్గరగా రా, మరీ దగ్గరగా రా, యింకా దగ్గరగా రా! కడగండ్ల నడుమ జడత పొడను మేలుకొలుపుమా.. దిగులొందు హృదయ మందిరాన దివ్వె నిలుపుమా! ఆశా నా ప్రాణసఖీ ప్రభాతా తారా!

మై గగురు పొడుచు శీతుగాలి తెరల దాడిలో
నా గుండె ల్రీల నవయ జేయు కలల పీడలో
నన్నొడిసి పట్ట వెన్నాడు నిరాశా కామినిని
నెన్నడుము విరుగ తరుమలో, నా మేను నిమురవో

ఆశా! నా ప్రాణ సఖీ ప్రభాత తారా
పాణి గృహీతి దారా, నా మధుర భావ ధారా
దగ్గరగా రా, మరీ దగ్గరగా రా, ఇంకా దగ్గరగా రా!!

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656