అంతర్జాతీయం

మైత్రితో ముందుకు పోదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండు, ఆగస్టు 31: ఇక్కడ జరుగుతున్న బిమ్స్‌టెక్ నాలుగో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ థాయిలాండ్, మయన్మార్, భూటాన్ దేశాలకు చెందిన నేతలతో శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘్థయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఒ-చాతో ఈ రోజు నేను చర్చలు జరిపా.. ఇరుదేశాల మధ్య సంబంధాల మెరుగుతో పాటు ఇరుదేశాల పౌరులకు ఉపయోగపడే అనేక అంశాలను మేమిద్దరం చర్చించుకున్నాం’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇరుదేశాల ప్రధానులు నిర్మాణాత్మక అంశాలపై చర్చలు జరిపారని, వారి చర్చలతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. ఇరుదేశాల నేతలు తమ అభిప్రాయలు పరస్పరం పంచుకున్నారని, పలు అంశాలలో ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. కాగా ప్రధాని మోదీ మయన్మార్ అధ్యక్షుడు విన్ మియింట్‌తో కూడా చర్చలు జరిపారు. తమమధ్య వాణిజ్య సహకారం, ఎనర్జీ, పలు ఇతర అంశాలపై చర్చలు జరిగాయని మోదీ తెలియజేశారన్నారు. అలాగే భూటాన్ ప్రధాన సలహాదారు దాషోత్సెరిగ్ వాంగ్‌చుక్‌తో చర్చలు జరిపారు. ‘పలు దేశాల ప్రధానులు, ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరపడం సంతోషాన్ని కలుగజేస్తోంది’ అని మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. బిమ్స్‌టెక్ సదస్సుకు హాజరైన పలుదేశాల ప్రతినిధులు పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర సహకారం, మైత్రితో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఇలావుండగా భారత్ సహకారంతో ఖాట్మాండ్‌లో యాత్రికుల కోసం నిర్మించిన 400 బెడ్ల సామర్థ్యం గల నేపాల్-్భరత్ మైత్రీ పశుపతి ధర్మశాలను భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని పి.శర్మ ఓలి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ధర్మశాలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంటూ దాని నిర్వహణ బాధ్యతలను పశుపతి ఏరియా డెవలప్‌మెంట్ ట్రస్టుకు అప్పగిస్తున్నట్టు చెప్పారు.