అంతర్జాతీయం

మా జోలికొస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 12: చైనాలో యుగర్ తెగకుచెందిన ముస్లింల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నామన్న నిరాధారమైన అభియోగాలతో ఆంక్షలు విధించేందుకు అమెరికా ప్రయత్నిస్తే, తీవ్రంగా వ్యతిరేకిస్తామని చైనా స్పష్టం చేసింది. చైనా అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునే ప్రసక్తిలేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వివరాలను ప్రతినిధి జెంగ్ షూంగ్ వెల్లడించారు. చైనాలో ఇటీవల కాలంలో యుగర్ తెగకుచెందిన ముస్లింల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు తమకు నమ్మకమైన సమాచారం వచ్చిందంటూ అమెరికా ప్రతినిధి హెదర్ నౌర్ట్ చేసిన ప్రకటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2017 నుంచి ఏప్రిల్ నుంచి చైనా ఈ తెగకు చెందిన వారి పట్ల దమనకాండ సాగిస్తోందన్నారు. ఈ హింసాకాండపై తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. ఈ విషయంలో చైనాను ఉపేక్షించవద్దని, ఆంక్షలు విధించాలంటూ అమెరికా రక్షణ కార్యదర్శి మైక్ పాంపియోపై అమెరికా చట్టసభలు వత్తిడి పెంచుతున్నాయి. కాగా అమెరికా తీరును ఎండగడతామని, తమ దేశంపై మాట్లాడే హక్కు ఇతర దేశాలకు ఉండదని చైనా ప్రతినిది జెంగ్ చెప్పారు. అన్ని వర్గాలు స్వేచ్ఛగా చైనాలో జీవిస్తున్నాయన్నారు.
కాగా చైనాలో తూర్పు టర్కిస్తాన్ ఇస్లామిక్‌మూమెంట్ ఉద్యమం జిన్‌జాంగ్ ప్రావిన్స్‌లో విస్తరించింది. ఈ ప్రాంతంలో యుగర్ ముస్లింలు ఎక్కువ సంఖ్యలో జీవిస్తున్నారు.
చైనాకు చెందిన హన్ వర్గానికి చెందిన ప్రజలు ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చి స్థిరపడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అమెరికా ఆరోపిస్తోంది. చైనా దాదాపు పది లక్షల మంది ముస్లింలను నిర్బంధించారని, క్యాంపులను నిర్వహస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్యానెల్ నివేదికను అమెరికా ప్రస్తావిస్తోంది. ఈ విషయమై ఐరాస మానవ హక్కుల కమిషనర్ మైఖేల్ బాచ్లెట్ మాట్లాడుతూ చైనాలో మానవహక్కుల ఉల్లంఘన ఆందోళన కలిగించే అంశమన్నారు.