అంతర్జాతీయం

పెను తుపానుతో కరోలినా అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విల్మింగ్టన్: అమెరికా తూర్పు ప్రాంతంలో కరోలినా తదితర చోట్ల భారీ వర్షాలు, తుపానులు,వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఫ్లోరెన్స్‌లో తుపాను తాకిడికి ఒక తల్లీ కూతురు మరణించారు. పెనుతుపాను తాకిడికి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల వ్యక్తులు గల్లంతైనట్లు సమాచారం వస్తోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైనట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. న్యూ బర్న్‌లో మూడు మీటర్ల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. అనేక మంది ఇండ్లలో చిక్కుకుని పోయారు. న్యూబెర్న్ టౌన్‌లో 30 వేల మంది వరద నీటిలో చిక్కుకున్నరు. ఈ ప్రాంతానికి ప్రమాదం ముప్పు తగ్గలేదని, పెను తుపానులు పొంచి ఉన్నాయని వాతావరణ కేంద్రం పదేపదే హెచ్చరిస్తోంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కరొలినా గవర్నర్ రాయ్ కపూర్ మాట్లాడుతూ, ఇంత పెద్ద తుపానులు మునుపెన్నడు సంభవించినట్లు సమాచారం లేదన్నారు. ఇంతవరకు వర్షాల వల్ల ముగ్గురు మరణించినట్లు సమాచారం ఉందన్నారు. గత కొన్ని రోజులుగా నార్త్‌కరోలినాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేదు. 7.60 లక్షల మంది కనీస సదుపాయాలు లేక అలమటిస్తున్నారు. 157 తాత్కాలిక ఆశ్రమాల్లో 21వేల మందికి వసతి కల్పించారు. వచ్చే వారంలో పెనుతుపాను తాకిడికి గురైనప్రాంతాల్లో అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సందర్శించనున్నారు. గంటకు 70 మైళ్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఎక్కడికక్కడ ప్రజా జీవితం అతలాకుతలమవుతోంది. న్యూబెర్న్ పట్టణంలో పరిస్థితులను నియంత్రించేందుకు అధికారులు కర్ఫ్యూను విధించారు.