అంతర్జాతీయం

ద్వైపాక్షిక సంబంధాలపై భారత్, రష్యా సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, సెప్టెంబర్ 14: వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను భారత్, రష్యా సమీక్షించాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శుక్రవారం రష్యా ఉప ప్రధాని యురీ బొరిసొవ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులతోపాటు శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతికాది రం గాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగవృద్ధిపై చర్చించారు. ఆతర్వాత సుష్మా, బొరిసొవ్ ఇక్కడ జరిగిన సాంకేతిక, ఆర్థిక సహకారంలో ఇక్కడ జరిగిన 23వ భారత్-రష్యా ప్రభుత్వాల కమిషన్ సదస్సు (ఐఆర్‌ఐజీసీ-టెక్)లో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను సమీక్షించడంతోపాటు, సరికొత్త రంగాలను అనే్వషించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. ఐఆర్‌ఐజీసీ-టెక్ ప్రతి సంవత్సరం సమావేశమై, భారత్, రష్యా దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షిస్తుందని రవీష్ తెలిపారు. అన్ని రంగాలను పరిశీలించినప్పటికీ, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు పేర్కొన్నారు. పరస్పర సహకారం పటిష్టపరచేందుకు రూపొందించాల్సిన ప్రణాళికలపై చర్చించారు.