అంతర్జాతీయం

ఈశాన్య రాష్ట్రాల రోడ్లకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, సెప్టెంబర్ 25: ఈశాన్యరాష్ట్రాల్లో రహదారుల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.90 లక్షల కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిధులను మంజూరు చేసిన ఘనత బీజేపీ సర్కార్‌కు దక్కుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో 14,000 కి.మీ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన షిల్లాంగ్‌కు వచ్చారు. ఈశాన్యరాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధిపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలు భూసేకరణ, అడవులకు క్లియరెన్సు, ఆక్రమణలకు పరిష్కారాల మార్గాల విషయమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో 10వేల కి.మీ రోడ్ల అభివృద్ధికి 1.66లక్షల కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు. అభివృద్ధి నిమిత్తం జాతీయ రహదారులు, వౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ్ధను ఏర్పాటు చేశామన్నారు. మరో 850కి.మీ జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.7వేల కోట్లనిధులను కేటాయించామన్నారు. 2421 కి.మీ మేర పబ్లిక్ వర్క్స్ అభివృద్ధికి రూ.17,257 కోట్ల నిధులను కేటాయించామన్నారు. ప్రస్తుతం జాతీయరహదారుల అభివృద్ధి సంస్థ రూ.7వేల కోట్లతో 850 కి.మీ పొడువురోడ్డు మార్గాలను నిర్మిస్తోందన్నారు. అస్సాంలోనే నాలుగు జాతీయ రహదారులను నిర్మించినట్లు చెప్పారు. మేఘాలయలో 62 కి.మీ రోడ్డును రూ.536 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. అస్సాంలో ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌కు 3140కి.మీ రహదారులను రూ.55,533 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. మేఘాలయలో ఇదే సంస్థ 1295 కి.మీ రోడ్డును రూ.18,869 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. రోడ్ల నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షించి క్లియరెన్సులను త్వరితగతిన మంజూరు చేయాలని ఆయన కోరారు.