అంతర్జాతీయం

అంతర్జాతీయ వేదికపై కాశ్మీర్ సమస్యా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్కు, సెప్టెంబర్ 27: కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసి) లేవనెత్తడానికి ఎలాంటి అధికారాలు లేవని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యూయార్కులో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఓఐసి నిర్వహించిన సమావేశంలో కాశ్మీర్ అంశం ప్రస్తావించడం తీవ్ర అభ్యంతరకరమని, భారత్ అంతర్గత సమస్య అయిన దీనిని ఇక్కడ చర్చించడం తగదని భారత్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. కేవలం భారత్ వ్యక్తిగత సమస్యగా ఉన్న దీనిని అంతర్జాతీయ వేదికపై ఎలా ప్రస్తావిస్తారని ఆయన ప్రశ్నించారు. తమ వ్యవహారాలో జోక్యం చేసుకోవద్దని ఓఐసీకి గతంలోనే చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒఐసీకి, దాని సభ్య దేశాలకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా జరిగిన దైపాక్షిక చర్చల్లో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఆయన ఉటంకిస్తూ చాలాకాలంగా పాకిస్తాన్ ఇలాంటి పనులే చేస్తోందని అన్నారు. దైపాక్షిక సమావేశాల్లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం వారికి ఇదేమీ మొదటిసారి కాదని, చాలాసార్లు దీనిని ప్రస్తావిస్తున్నారని, అయితే వారికి అంతర్జాతీయ సమాజం నుంచి కాని, సభ్య దేశాల నుంచి కాని దీనిపై మద్దతు కరవవుతోందని ఆయన అన్నారు. దీనిని గమనించి ఆ దేశం ఇకనైనా తన తప్పుడు విధానాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం ఖురేషి, భారత్ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మధ్య ఏమైనా చర్చలు జరుగుతాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని తాము ఇప్పటికే స్పష్టం చేశామని, అయితే వారిద్దరూ కరచాలనం చేసుకుంటారా లేదా అన్నది తాము ఊహించలేమని ఆయన వ్యాఖ్యానించారు.