అంతర్జాతీయం

ఇండోనేషియాలో సునామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకస్సార్ (ఇండోనేషియా), సెప్టెంబర్ 28: ఇండోనేషియాను భూకంపం కుదిపేసింది. ఈ ద్వీపకల్పంలో భూకంప తీవ్రత వల్ల సునామీ సంభవించింది. సులావేసి ద్వీపంలోని నగరాన్ని సునామీ రాకాసి అలలు ముంచెత్తాయి. దీంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా ప్రకటించలేదు. రిక్టర్ స్కేలుపై 7.5 పరిమాణంలో భూకంప తీవ్రత నమోదైంది. సునామీ అలలు పెద్ద ఎత్తున నగరాన్ని చుట్టుముట్టాయి. ఈ నగరంలో 3.5లక్షల జనాభా ఉంది. ఈ నగరానికి 80 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ప్రారంభమైనట్లు శాస్తవ్రేత్తలు తెలిపారు. సునామీ అలలకు పెద్దమసీదు, అనేక భవనాలు నీట మునిగాయి. పెను అలల తాకిడికి ఈ నగరం అల్లాడిందని, అపార నష్టం సంభవించినట్లు భూకంపాల అధ్యయన కేంద్రం రెహమాత్ త్రియోనా తెలిపింది. ఈ సునామీ తీవ్రత ఎక్కువగా ఉన్నందు వల్ల ఇప్పటికిప్పుడు ఏ మేరకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందో అంచనా వేయలేమని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు సముద్ర గర్భంలో పది కి.మీ లోతులో భూకంప కేంద్రంను గుర్తించారు. పెద్ద భవనాలుకూలడంతో ప్రజలు రోడ్లపైన పరుగెత్తుతున్న దృశ్యాలు కనిపించాయ.