అంతర్జాతీయం

భారత్ పర్యటనపై ట్రంప్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 28: భారతదేశంలో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని, ఇటీవలి కాలంలో ఆయన చేసిన సానుకూల వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ ఉన్నతాధికారు ఒకరు అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కించాలన్న ఆకాంక్ష ఆయన చర్యల్లోనూ, వ్యాఖ్యల్లోనూ వ్యక్తమవుతోందని తెలిపారు. వచ్చే ఏడాది జరుగనున్న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా రావాలని ఇప్పటికే ట్రంప్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో భారత్-అమెరికాల మధ్య సన్నిహిత సంబంధాలు బలోపేతమైన నేపథ్యంలో ఈ దేశంలో పర్యటించేందుకు ట్రంప్ ఆసక్తికరంగా ఉన్నారని ఆ అధికారి వెల్లడించారు. ఇటీవల సుస్మాస్వరాజ్ కలిసిన సందర్భంగా మాట్లాడిన ట్రంప్ ‘ఐ లవ్ ఇండియా..నా స్నేహితుడు మోదీకి అభినందనలు తెలపండి’ అని వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సీనియర్ అధికారి అలీస్ వెల్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, ట్రంప్ భారత్ పర్యటన ఎప్పుడు జరుగుతుందన్న దానిపై తన వద్ద ఎలాంటి వివరాలు లేవని పేర్కొన్న ఆయన ఈ పర్యటన సాధ్యమైనంత త్వరలో చేపట్టాలని ఆయన ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రధాని మోదీ రెండు సందర్భాల్లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఒకటి వాషింగ్టన్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశం కాగా, రెండోది మనీలాలో జరిగిన శిఖరాగ్ర భేటీలో వీరి మధ్య సమావేశం జరిగింది.