అంతర్జాతీయం

సామూహిక ఖననాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలూ (ఇండోనేషియా), సెప్టెంబర్ 30: ఇండోనేషియాలోని పలూ ప్రాంతాన్ని కుదిపేసిన సునామీలో మృతుల సంఖ్య 800లకుపైగానే ఉందని అధికారులు ప్రకటించారు. చనిపోయిన వారి భౌతిక కాయాలను ఆదివారం సామూహికంగా ఖననం చేశారు. మృతుల సంఖ్య పెరుగుతునే ఉందని, ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 832 మంది మరణించారని ఇండోనేషియా ఉపాధ్యక్షుడు జూసుఫ్ కల్లా ప్రకటించారు. సలావెసీ ద్వీపం భారీగా దెబ్బతిన్నదని, లెక్కకు మించిన భవనాలు శిథిలమయ్యాయని, రోడ్లు కొట్టుకుపోగా సమాచార వ్యవస్థ అతలాకుతలమైందని ఆయన తెలిపారు. కాగా, నిమిషానికో అంబులెన్స్ వస్తున్నదని, అందులో శవాలు కుప్పలుగా ఉంటున్నాయని 35 ఏళ్ల రిసా కుసుమ తెలిపింది. ఇలాంటి భయానకమైన ప్రళయాన్ని తాను ఎన్నడూ చూడలేదని అన్నది. సుమానీ కారణంగా చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందేమోనన్న అనుమానం వ్యక్తం చేసింది. పలూ నివాసులు చాలా మంది ఇలాంటి అభిప్రాయానే్న వెల్లడిస్తున్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్టవచ్చని అంటున్నారు. కొట్టుకుపోయిన రోడ్లకు మరమ్మతులు చేయడం, విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయడం శిథిలమైన భవనాల స్థానంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టం వంటి అనేకానేక సమస్యలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు వేలాది మందితో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. వైద్యులు, సిబ్బంది నిర్విరామంగా సేవలు అందిస్తున్నప్పటికీ, ఇంకా వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న వారు వేలల్లో ఉన్నారు.