అంతర్జాతీయం

వృద్ధిరేటు అమోఘం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 9: భారత్ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటోందని ప్రపంచ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2018లో 7.3 శాతం, వచ్చే ఏడాది 7.4 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. చైనాతో పోల్చితే భారత్ 0.7 శాతం అధికంగా వృద్ధిరేటు నమోదు చేస్తుందని తెలిపారు. 2017లో భారత్ 6.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయని ఐఎంఎఫ్ నివేదికలో తెలిపింది. వస్తుసేవా పన్ను వసూళ్లు బాగున్నాయి. దివాలా ప్రక్రియ కోడ్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణల వల్ల విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఐఎంఎఫ్ ఇటీవల ప్రపంచ ఎకనామిక్ అవుట్‌లుక్ (డబ్ల్యుఈఓ) నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చమురు ధరలు తదితర కారణాలను సైతం తట్టుకుని భారత్ ఆర్థికరంగం దూసుకుపోతోంది. భారత్ మధ్యకాలిక వృద్ధిరేటు 7 శాతం నమోదైంది. ఇదే స్పీడు కొనసాగితే చైనాను భారత్ అధిగమిస్తుంది. ఈ నివేదికను బాలిలో జరిగిన వార్షిక ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సదస్సులో విడుదల శారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోకంటే వచ్చే ఏడాది వృద్ధిరేటు చైనాలో తగ్గుతుందన్నారు. చైనా దిగుమతులపై అమెరికా టారిఫ్‌ను పెంచింది. దీనివల్ల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చైనా వృద్ధిరేటు 6.9 శాతం నుంచి 6.2 శాతానికి వచ్చే ఏడాది తగ్గే అవకాశాలున్నాయి. భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, ప్రక్షాళన, పరపతి విధానాన్ని పటిష్టం చేయడం వల్ల ఆర్థికాభివృద్ధిరేటు పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసింది. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు అభివృద్ధికి దోహదపడనున్నాయి. వస్తు సేవా పన్ను పన్నుల రంగంలో సంస్కరణల వేగాన్ని పెంచింది. సబ్సిడీ ప్రక్రియలను తగ్గిస్తున్నారను. ఇవన్నీ కూడా వృద్ధిరేటు పుంజుకోవడానికి దోహదపడుతున్నాయి. ఈ ఏడాది ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతానికి పెరుగుతుందని, గత ఏడాది 3.6 శాతం నమోదైందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆసియా దేశాల్లో మార్కెట్లలో ఉత్సాహం ఉందని, వృద్ధిరేటు బాగుందని ఐఎంఎఫ్ పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది వృద్ధిరేటు 2.9 శాతం నమోదవుతుందని, వచ్చే ఏడాది 2.5 శాతం ఉంటుందని అంచనా వేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.