అంతర్జాతీయం

అబార్షన్లకు ఇక చట్టబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 26: ఐర్లాండ్‌లో అబార్షన్ (గర్భ విచ్ఛిత్తి) నిషేధిత చట్టాలను రద్దు చేయాలని ప్రజలు రెఫరెండమ్‌లో తేల్చి చెప్పారు. ఐర్లాండ్‌లో అబార్షన్ నిషేధిత చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఈ అంశంపై ఐర్లాండ్ ప్రభుత్వం నిర్వహించిన రెఫరెండమ్‌లో 68 శాతం మంది ప్రజలు అబార్షన్ నిషేధిత చట్టాలను రద్దు చేయాలని ఓటు వేశారు. ఇది చారిత్రాత్మక విజయమని భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వరడ్కర్ ప్రకటించారు. ఈ రెఫరెండమ్‌పై ఎగ్జిట్‌పోల్స్‌ను ఐరిష్ టైమ్స్ ప్రకటించింది. ఐర్లాండ్ ప్రభుత్వం అబార్షన్‌కు చట్ట బద్ధత కల్పిస్తూ రాజ్యాంగానికి ఎనిమిదివ సవరణ ప్రతిపాదించింది. దీనిపై రెఫరెండమ్ నిర్వహించించారు. ఈ రెఫరెండమ్ ఫలితాలను అధికారికంగా నేడు వెల్లడిస్తారు. ఐర్లాండ్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. అబార్షన్‌పై ఈ పార్టీలు అధికారికంగా తమ వైఖరిని వెల్లడించలేదు. కాని పార్టీనేతలు తమ అభిప్రాయాలను ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పించాయి. ఐర్లాండ్ ప్రధాని లియో వరడ్కర్ మాత్రం మొదటి నుంచి అబార్షన్‌కు అనుకూలంగా ఉన్నారు. ఐర్లాండ్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందనేందుకు రెఫరెండమ్ నిదర్శనమన్నారు. విదేశాల్లో ఉన్న ఐర్లాండ్ ఓటర్లు ఈ రెఫరెండమ్‌లో పాల్గొనేందుకు ఐర్లాండ్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ దేశాల్లో ఉన్న ఐరిష్ ఓటర్లకు ఈ అంశంపై సామాజి మాధ్యమాల ద్వారా సందేశాలను పంపారు. 2015లో స్వలింగ సంపర్కుల వివాహానికి కూడా మద్దతు లభించింది. ఫ్లెబిసైట్‌లో ఈ వివాహాలకు అనుకూలంగా 61 శాతం మంది ఓట్లు వేశారు. ఐర్లాండ్ ప్రజలు అబార్షన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయాలని కోరుకోవడాన్ని యుకె మహిళల వ్యవహారాల శాఖ మంత్రి పెన్నీ మార్డండ్ స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. 2012లో భారత్ సంతతికి చెందిన సవితా హలప్పన్వర్ అనే దంతవైద్యురాలికి అబార్షన్ చేసేందుకు ఆస్పత్రి నిరాకరించింది. దీంతో ఆమె అనారోగ్యంతో మరణించారు. ఐర్లాండ్ కేథలిక్ దేశమైనందు వల్ల ఆ దేశంలో మహిళలు అబార్షన్లను చేయించుకోవడానికి వీలులేకుండా కఠినమైన చట్టాలు మొదటి నుంచి అమలులో ఉన్నాయి.