అంతర్జాతీయం

లైంగిక వేధింపులపై గూగుల్‌లో ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ఫ్రాన్సిస్కో, నవంబర్ 9: గూగుల్ సంస్థలో లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి త్వరలో విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేస్తామని గూగుల్ సీఈవో సందర్ పిచ్చై ప్రకటించారు. ఈ విషయమైన ఉద్యోగులకు ఇ మెయిల్ ద్వారా మెమో పంపారు. ఇటీవల గూగుల్‌కు చెందిన ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు నిరసనగా నిరసనలు వ్యక్తం చేసిన విషయం విదితమే. వేధింపులకు పాల్పడుతున్న ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌ల పట్ల యాజమాన్యం మెతకవైఖరి అవలంభిస్తోందని ఉద్యోగులు ఆరోపించారు. దీనిపై సుందర పిచ్చై స్పందించారు. గతంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయం సరైందని భావించమన్నారు. ఈ విషయమై త్వరలో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. మంచి వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గూగుల్ ఉద్యోగుల అభిప్రాయాలు, డిమాండ్లకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. గత వారం ప్రపంచ వ్యాప్తంగా 20వేల మంది ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారని, ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. కంపెనీ బోర్డులో ఉద్యోగుల తరఫున ఒక ప్రతినిధి ఉండాలని, వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు కఠినంగా ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇకపై లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని గూగుల్ యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై ఉద్యోగుల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తామన్నారు. వేధింపులకు గురవుతున్న కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరారు. గూగుల్ సీఈవో జారీ చేసిన మెమో టెక్ ఉద్యోగులకు ఇ మెయిల్ ద్వారా చేరిందని, కాని ఈ సమాచారాన్ని కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులకు ఇవ్వలేదని గూగుల్ ఉద్యోగులు తెలిపారు. తమ డిమాండ్లను పూర్తిగా పరిష్కరించేంత వరకు తాము అవసరమైన సమయాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని వారు చెప్పారు.