అంతర్జాతీయం

భారత్‌కు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, మే 30: ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా పౌరులకు 30 రోజుల పాటు ఉచిత వీసా సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. తమ మూల దేశమైన భారత్‌లో పర్యటించి ‘సరికొత్త భారత్’లో అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇండోనేసియా రాజధానిలోని జకార్తా కనె్వన్షన్ సెంటర్‌లో భారత సంతతి పౌరులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ‘్భరత్‌లో పర్యటించేందుకు ఇండోనేసియా పౌరులకు 30 రోజులపాటు ఉచిత వీసా సదుపాయం కల్పిస్తాం’ అన్నారు. ‘మీలో చాలామంది భారత్‌కు వచ్చి ఉండరు. అదువల్ల వచ్చే ఏడాది ప్రయాగలో నిర్వహించే కుంభమేళాలో పాల్గొనేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా’ అన్నారు. గత ప్రభుత్వాల తీరును విమర్శిస్తూ, దేశాన్ని అవినీతి రహితం చేయడం, పౌరులకే ప్రాధాన్యత ఇచ్చేవిధంగా అభివృద్ధికి పెద్దపీట వేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా దేశాన్ని తమ ప్రభుత్వం సిద్ధం చేస్తుందన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మరో అడుగు ముందుకేసి ‘ఈజ్ లివింగ్’పై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. 2022 నాటికి సరికొత్త భారత్‌ను ఆవిష్కృతం చేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు ఆసియా దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తున్నారు.