అంతర్జాతీయం

ఈశాన్య అభివృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్‌పూర్ (త్రిపుర), జూన్ 7: కేంద్ర ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీని అమలు పరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నదని రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. గోమతి జిల్లాలోని త్రిపురసుందరి దేవాలయాన్ని, దక్షిణ త్రిపురలోని సబ్రూమ్‌ను కలిపే జాతీయ రహదారిని ఆయన గురువారం దేశానికి అంకితం ఇచ్చారు. 73.71 కిలోమీటర్ల దూరమున్న ఈ రహదారి ఇప్పటివరకు సింగిల్ లేన్‌గా ఉండేది. ప్రస్తుతం దీన్ని పునరుద్ధరించి రెండులేన్ల రోడ్డుగా మార్పుచేశారు. ఈ సందర్భంగా రాష్టప్రతి మాట్లాడుతూ ఈ రోడ్డు దక్షిణ త్రిపుర జిల్లాను బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ రేవుతో అనుసంధానిస్తుందన్నారు. ఈ రోడ్డును భారత్-బంగ్లాదేశ్‌ల సరిహద్దు వద్ద, ఫెనీ నదిపై నిర్మిస్తున్న వంతెనకు అనుసంధానించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తికాగానే త్రిపుర-చిట్టగాంగ్‌ల మధ్య అనుసంధానత ఏర్పడుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి పరచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్రం ప్రారంభించింది. ఒక్క త్రిపురలోనే 500 కిలోమీటర్ల మేర రహదారులను రూ.6వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. రహదారులు మనుషుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయని పేర్కొంటూ దేశవిభజన వల్ల అగర్తలా-కోల్‌కతాల మధ్య దూరం ఎంతగా పెరిగిపోయిందో వివరించారు. దేశవిభజన జరగకముందు ఈ రెండు నగరాల మధ్య దూరం కేవలం 500 కిలోమీటర్లు. అంటే ఈ మార్గం ప్రస్తుత బంగ్లాదేశ్ గుండా కొనసాగేది. కానీ విభజనానంతరం చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడంతో ఏకంగా 1700 కిలోమీటర్లకు పెరిగిపోయిందని ఆయన వివరించారు. ఇదే సమయంలో త్రిపుర ప్రభుత్వం అమలు పరుస్తన్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. వెనుకబడిన తరగతుల వారు అభివృద్ధి చెందకుండా, దేశ ప్రగతి సాధ్యం కాదన్నారు. త్రిపురలోని గిరిజన వర్గాలనుంచి దేశం గర్వించదగ్గ అథ్లెట్స్ రూపొందారన్నారు. ‘ఏస్ టెన్నిస్ క్రీడాకారుడు సోమదేవ్ దేబర్మన్, సౌరవి దేబర్మన్, జాతీయ మహిళా ఫూట్‌బాల్ క్రీడాకారిణి లాక్సిత దేబర్మన్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు’ అన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్, గవర్నర్ తథాగత రాయ్‌లు ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్టప్రతి త్రిపురసుందరీ దేవి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. దేశంలోని 51 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి. ‘మాతాబరి దేవాలయ కాంప్లెక్స్’ పునరుద్ధరణకు ఆయన శంకుస్థాపన చేశారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం, రాష్టప్రతి గౌరవార్థం రిసిప్షన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ‘క్వీన్ వెరైటీ ఆఫ్ పైనాపిల్’ను రాష్ట్ర ‘్ఫలం’గా ప్రకటించారు.