అంతర్జాతీయం

దలైలామా వారసుడి ఎంపికలో చైనా పెత్తనమేంటి? నిలదీసిన అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 8: దలైలామాగా బౌద్ధమతంలోని లామాలనే టిబెటన్లు ఎంపిక చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం సూచించింది. టిబెటన్ల మత విశ్వాసాల ప్రకారం ఎవరి జోక్యం లేకుండా దలైలామాగా లామాలకు చెందిన వారినే ఎంపిక చేసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. టిబెట్‌లో చైనా జోక్యాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ఈ సూచన చేసిందని భావిస్తున్నారు. టిబెటన్లు తమకు ఇష్టమైన మత నాయకుడిని దలైలామాగా ఎన్నుకునే హక్కును కలిగి ఉన్నారని, ఇది వారి మత స్వేచ్చలో భాగమని అమెరికా పేర్కొంది. ఈ వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండరాదన్నారు. అదే సమయంలో టిబెటన్ల విశ్వాసాలను ప్రతి ఒక్కరు గౌరవించాల్సి ఉందన్నారు. ఈ నివేదికను అమెరికా ప్రభుత్వ శాసనవ్యవహారాల శాఖ అసిస్టెంట్ సెక్రటరీ విడుదల చేశారు. టిబెట్‌లో చైనా జోక్యం తగదని, వారి మతస్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, వారి హక్కులకు భంగం కలిగించే విధంగా నడుచుకోరాదని, వారి సంస్కృతి, భాష, మతపరమైన భావాలను హరించి వేసే విధంగా చర్యలు తీసుకోరాదని అమెరికా మొదటి నుంచి చైనాను కోరుతోంది. దలైలామా ఎంపికపై చైనా ఒక స్పష్టమైన ప్రకటన గతంలోనే విడుదల చేసింది. తమ మత విధానాలకు అనుగుణంగానే దలైలామాను ఎంపిక చేసుకోవాలని, కాని ఆ వ్యక్తికి చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉండాలని చైనా కోరుతోంది. ఈ విధానాన్ని మొదటి నుంచి అమెరికా తప్పుబడుతోంది. టిబెట్‌లోకి జర్నలిస్టులు, పర్యాటకులు, దౌత్యవేత్తలను అనుమతించాలని అమెరికా చైనాను కోరింది. చైనాలో ప్రాథమిక హక్కులు, మానవ హక్కులను ప్రభుత్వం గౌరవించి, పరిరక్షించాలని, ఎవరు ఏ దేశానికైనా వెళ్లే హక్కును ప్రజలకు కల్పించాలని అమెరికా వాదిస్తోంది. కాగా చైనాతో 2010 నుంచి దలైలామా చర్చలు చేయ డం లేదు. దలైలామా, చైనా మధ్య చర్చలు అర్ధవంతంగా జరగాలని మొదటి నుంచి అమెరికా భావిస్తోంది. చైనాలో టిబెటన్లకు స్వయంప్రతిపత్తి ఇవ్వకపోవడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాంతంలో దీర్ఘకాలం పాటు శాంతి పరిఢవిల్లాలంటే, సుస్థిర వాతావరణం నెలకొనాలంటే నిరంతరం చర్చలు అవసరమని, దీనికి చైనా చొరవ తీసుకోవాలని చైనాపై అమెరికా వత్తిడి తెస్తోంది. 1959లో దలైలామా చైనాను వదిలి భారత్‌కు వచ్చి ధర్మశాలలో ఉంటున్నారు. 82 ఏళ్ల దలైలామా వారసుడి ఎంపికకు తమ ఆమోద ముద్ర ఉండాలని చైనా కమ్యూనిస్టు పాలకులు కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు.