అంతర్జాతీయం

తొలగనిమానస సరోవర్ యాత్రికుల కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండూ, జూలై 5: పవిత్ర మానససరోవర్ యాత్రికుల కష్టాలు ఇంకా తొలగిపోలేదు. మానససరోవర్‌ను సందర్శించి వస్తున్న వెయ్యి మంది యాత్రికులు నేపాల్ పర్వత ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య యాత్రికులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. భారత్ అధికారుల చొరవ వల్ల హిల్సాలో చిక్కుకున్న 250 మంది భారతీయ యాత్రికులను సురక్షితంగా బయట పడ్డారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు నిరంతరం కురియడం వల్ల సహాయక చర్యలు చేపట్టేందుక ఆటంకాలు తలెత్తుతున్నాయి. గురువారం ఉదయం పది వాణిజ్య కమర్షియల్ విమానాలను రంగంలోకి దింపి 143 మందిని యాత్రికులను సిమికోట్ నుంచి నేపాల్‌గంజ్‌కు తరలించినట్లు నేపాల్‌లో భారత్ ఎంబసీ ట్వీట్ చేసింది. పర్వత ప్రాంతాల్లో సిమికోట్‌లో 643 మంది, హిల్సాలో 350 మంది యాత్రికులు చిక్కుకున్నారు. యాత్రికులు సురక్షితంగా ఉన్నారని, ఎటువంటి అపాయం కలగలేదని భారత్ ఎంబసీ పేర్కొంది. వీరిని రక్షించేందుకు వాతావరణం అనుకూలించడం లేదు. సిమికోట్‌లో పెద్దసంఖ్యలో యాత్రికులు వేచి ఉన్నారని, తమను అక్కడి నుంచి సురక్షిత గమ్యస్ధానాలకు తరలిస్తారన్న ఆశతో ఉన్నారని జిల్లా పోలీసు అధికారులు చెప్పారు. ఈ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఉంటున్న యాత్రికులకు వాతావరణం అనుకూలించక స్వల్ప అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఖాట్మాండూ పోస్టు కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఇంతవరకు పర్వత ప్రాంతాల్లో వాతావరణం పడక ఎనిమిది మంది మరణించారు. సిమికోట్, హిల్సా ప్రాంతాల్లో కనీస వౌలిక వైద్య సదుపాయాలు లేవని, హోటళ్లు, తలదాచుకునేందుకు లాడ్జిలు లేవని భారత్ ఎంబసీ పేర్కొంది. ఈ రెండు ప్రాంతాలకు రోడ్డు మార్గం లేదు. కేవలం విమానాలు, హెలికాప్టర్లద్వారానే బయటి ప్రపంచంతో సంబంధాలు కలిగి ఉన్నాయి. వాతావరణం అనుకూలిస్తే చిన్న విమానాలు, హెలికాప్టర్లు ఈ ప్రాంతానికి వెళతాయి. దుర్భేద్యమైన పర్వతప్రాంతాలని, ఇక్కడ వాతావరణం ఆకస్మికంగా మారుతుంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎంబసీ అధికారులు హాట్‌లైన్ సదుపాయాన్ని కల్పించారు. చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న మానస సరోవర్ హిందువులు, బౌద్ధులు, జైనులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. సాలీనా భారత్ నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు మానస సరోవర్ సందర్శనకు వెళుతుంటారు.