అంతర్జాతీయం

జపాన్‌లో వరద బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూలై 7: దక్షిణ జపాన్‌లో భారీ వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. వరద బీభత్సానికి 38 మంది మరణించినట్టు, నలుగురు గాయపడ్డారని అధికార మీడియా ఎన్‌హెచ్‌కే శనివారం వెల్లడించింది. సుమారు 50 మంది గల్లంతయ్యారని తెలిపారు. వొకాయమ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. జనవాసాలన్నీ ఓ జలాశయాన్ని తలపించేలా ఉన్నాయి. వరద దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండంతో జనం ఇళ్లపై తలదాచుకోవడం కనిపించింది. బాల్కానీలు, ఎత్తయిన ప్రాంతాలకు చేరుకున్నారు. బాధితులను రక్షించడానికి హెలికాప్టర్లను రంగంలోకి దించారు. వొకాయమలో మట్టిపెళ్లు పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఆరుగురి ఆచూకీ తెలియడం లేదు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. సుమారు 3 లక్షల 60 వేల మంది చిక్కుకున్నట్టు ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లన్నీ నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఏకంగా ఐదుమీటర్లు అంటే 16 అడుగుల ఎత్తులో వరద పారుతోందని ఎన్‌హెచ్‌కే టీవీ పేర్కొంది. హిరోషిమాలో కొండ చరియలు విరిగిపడి ఒక వ్యక్తి మృతి చెందాడని, మొత్తంగా 34 మంది చనిపోయినట్టు కొయోడో వార్తా సంస్థ ప్రకటించింది. మరోచోట నిప్పంటుకుని ఓ బాలుడు మరణించాడన్నారు. హిరోషిమాలో బురదలో కూరుకుపోయి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షాలు, వరదలకు భారీగానే ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లిందని అధికార వర్గాలు తెలిపాయి. ఎహీమేలోని ఓ ఇంట్లో రెండో అంతస్తు కూలిపోయి ఓ మహిళ మరణించిందని వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే ఇద్దరు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థినులు, వారి తల్లి మట్టిపెళ్ల కింద చిక్కుకుపోయారని తెలిపింది. వారు ప్రాణాలతో బతికిబట్టకట్టే అవకాశం లేదని వార్తా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో మిలటరీ వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దింపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో సైన్యం పూర్తగా నిమగ్యమై ఉంది. మిలటరీ బోట్లు సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. పోలీసులు, సైన్యం, అగ్నిమాపక దళాలు, స్థానిక అధికారులు రేయింబవళ్లూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.