అంతర్జాతీయం

మా పార్టీ గెలిస్తే షాబాజే ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 18: పాకిస్తాన్‌లో రాబోయే ఎన్నికల్లో ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే, నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్‌కే ప్రధాన మంత్రి పదవి దక్కుతుందని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సీనియర్ నేత, మాజీ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ స్పష్టం చేశారు. అయితే, తుది నిర్ణయం పార్టీలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని అన్నారు. అక్రమార్జన, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుతం పదేళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది జూలై మాసంలోనే అతనిని పాక్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనితో, నవాజ్ పార్టీ గెలిచినప్పటికీ, అతను ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒకవేళ మార్గాలు ఏర్పడి, నవాజ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకోవడానికి వీలైతే, అతనికే పగ్గాలు దక్కుతాయి. ఆ అవకాశం లేకపోతే, ప్రధాని పదవి కోసం పీఎంఎల్-ఎన్‌లో చాలా మంది పోటీదారులు ఉన్నారని, వారిలో అబ్బాసీ కూడా ఒకరని వార్తలు వచ్చాయి. అయితే, ఈ అనుమానాలను అబ్బాసీ బుధవారం ఒక ఇంటర్వ్యూలో తోసిపుచ్చారు. తమ పార్టీ గెలిస్తే, నవాజ్ సోదరుడు, పార్టీలో సీనియర్ నాయకుడు షాబాజ్‌నే ఆ పదవికి ఎన్నుకునే అవకాశాలున్నాయని అన్నారు. పార్టీలో చర్చ జరిగి, అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతానికి ప్రధాన మంత్రి పదవికి షాబాజ్ మాత్రమే రేసులో ఉన్నట్టు స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.