అంతర్జాతీయం

పౌరసత్వం ప్రశ్నార్థకం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, జూలై 30: గత కొంత కాలంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తూ వచ్చిన అసోం జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) దాదాపు 40లక్షల మంది పౌరుల పౌరసత్వానే్న ప్రశ్నార్థకం చేసింది. రాష్ట్రంలోని ప్రజల పౌరసత్వాన్ని నిర్ధారించే జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదాను అసోం ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ రిజిస్టర్‌లో 40 లక్షల మంది పౌరుల పేర్లను తొలగించడంతో పౌరుల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోకి బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర దేశాలకు చెందిన వలసదారులు ఎక్కువమంది నివసిస్తున్న నేపథ్యంలో భారత్‌పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో ఈ ప్రక్రియను చేపట్టారు. ఇందులో తమ పేర్లు లేకపోవడంతో తమ పౌరసత్వానే్న తొలగించారన్న లక్షలాది మందిలో ఒక్కసారిగా భయం తలెత్తింది. ముసాయిదా విడుదల సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్ శైలేష్ విలేఖరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రిజిస్టర్‌లో పేర్ల నమోదుకు మొత్తం 3,29,91,384 దరఖాస్తులు రాగా అందులో 2,89,83,677 మంది పేర్లను ముసాయిదాలో చేర్చామని ఆయన చెప్పారు. 40 లక్షల మంది దరఖాస్తులు తిరస్కరించామని, అయితే రిజిస్టర్‌లో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని, ఇది ఆఖరి లిస్టు కాదని, దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే ఆగస్టు 30 తర్వాత నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. ఈ సవరణ ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు జరుగుతుందని తెలిపారు. పౌరులు తమ పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలను దరఖాస్తులకు జత చేశారని, అవన్నీ పరిశీలించిన తర్వాతే ఈ ముసాయిదా తయారైందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. పేర్లు తొలగించిన 40 లక్షల మందికి వారి తొలగింపునకు గల కారణాలను వ్యక్తిగతంగా తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఆ కారణాలను బహిరంగంగా వెల్లడించలేమన్నారు. అయితే వారి పేర్లను తొలగించడానికి నాలుగు కారణాలను ప్రాతిపదికగా తీసుకున్నారన్నారు. జాతీయ పౌర రిజిస్టర్ విడుదల తర్వాత అందులో నమోదైన వారిని భారతీయులు, భారతీయేతరులుగా ప్రస్తుతం పిలవమని కేంద్ర హోంమినిస్ట్రీ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గ్ తెలిపారు. అంతేకాకుండా ఇప్పట్లో ఎవరి పేర్లను విదేశీ ట్రిబ్యునల్స్‌కు పంపమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై దృష్టి సారించామన్నారు. ఇది పూర్తి ముసాయిదా కాదని, దీనిపై అభ్యంతరాలను తెలుపుకోవడానికి ఇంకా సమయముందని, పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. ఆఖరి లిస్టు వచ్చే వరకు రాష్ట్రంలో ఇప్పుడున్న యథాతథ స్థితి కొనసాగుతుందన్నారు. కాగా దేశంలోని మొదటిసారిగా 1971 మార్చి 24న అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ను తయారు చేశారు. ఎన్‌ఆర్‌సి మొదటి ముసాయిదా జనవరి ఒకటిన విడుదల చేయగా, అందులో 1.9 కోట్ల మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత దానిని సవరించి తాజాగా జాతీయ పౌర రిజిస్టర్‌ను విడుదల చేయగా, అందులో 40 లక్షల మందికి చోటు దక్కలేదు. ఇలా వుండగా పౌరులుగా నమోదు కాని వారు తమకు గల అభ్యంతరాలను రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేసే ఎన్‌ఆర్‌సి సేవా కేంద్రాల్లో తెలియజేయాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు కోరుతున్నారు.