అంతర్జాతీయం

కువైట్‌లో కూలీల కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూలై 31: నిర్మాణ రంగంలోని ఓ ప్రముఖ ప్రైవేటు కంపెనీ ద్వారా పనులు చేసి బకాయిల కోసం ఎదురు చూస్తున్న 710 మంది కూలీలకు ఎట్టకేలకు కువైట్ ప్రభుత్వం అభయహస్తం చూపింది. కూలీలకు సంబంధించి తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత దేశానికి తిరుగుముఖం పట్టిన కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి బకారుూలను సైతం ఆ ప్రైవేటు కంపెనీ చెల్లించలేదు. ఈ క్రమంలో కువైట్ ప్రభుత్వమే ఈ కూలీలకు పరిహారం చెల్లించేందుకు సంసిద్ధను తెలియజేసింది. కువైట్ కార్మిక, సాంఘిక కార్యకలాపాల మంత్రిత్వ శాఖ ద్వారా ఒక్కో కార్మికునికి 56,680 (కేడీ 250) రూపాయలు సహాయంగా అందజేయడం జరుగుతుంది. వీరంతా గడచిన రెండేళ్ల కాలంగా పబ్లిక్ అథారిటీస్ ఆఫ్ మేన్‌పవర్ (పీఏఎం)లో తమ పేర్లను నమోదు చేసుకుని మన దేశం నుంచి కువైట్ వెళ్లి కరాఫీ నేషనల్ కంపెనీ పేరిట ఉన్న ప్రైవేటు కంపెనీలో కార్మికులుగా పనిచేశారని భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. ఇలావుండగా గత యేడాది కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 3,614 మంది కార్మికులు కష్టాల్లో పడి దేశానికి తిరుగుముఖం పట్టారని వీరికి కూలీ బకాయిలు, సెక్యూరిటీ డిపాజిట్లు తిరిగి రావాల్సివుందని వారి అకౌంట్లలోకి సొమ్మును బదలాయించడం జరుగుతుందని కువైట్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. కాగా మన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈ యేదాది ప్రధమార్థంలో కువైట్ వెళ్లి అధికారులతో ఈ అంశంపై సంప్రదింపులు జరిపి సమస్యకు ఓ పరిష్కారాన్ని నిర్ణయించారు. భారత రాయబార కార్యాలయ అధికారులు సైతం తదుపరి ఈ వ్యవహారంపై కసరత్తు చేసి పలు కారణాలచేత బాధిత కూలీల జాబితాను మొత్తం 1,262 మందిగా సవరించి కువైట్ ప్రభుత్వానికి నివేదించించారు. అయితే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మేన్‌పవర్ (పీఏఎం) అధికారులు జాబితాను 710కి కుదించి వీరే పరిహారం అందుకోవడానికి అర్హులుగా నిర్ణయించారని భారత రాయభార కార్యాలయ అధికారులు తెలిపారు. కాగా మిగిలిన 552 మంది కార్మికులకు సైతం న్యాయం చేసేందుకు తమ వంతు కృషిని భారత రాయభార కార్యాలయ అధికారులు చేపట్టి కువైట్ ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నారు.