తెలంగాణ

ఆగస్టు 12నుంచి కృష్ణా పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: వచ్చే నెల పనె్నండవ తేదీ నుంచి పనె్నండు రోజుల పాటు కృష్ణా పుష్కరాలు జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరో మూడు వారాల గడువు మాత్రమే ఉండడంతో మంత్రులు పుష్కరాల ఏర్పాట్లలో మునిగిపోయారు. కృష్ణా నది కర్నాటక నుంచి తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కృష్ణా పుష్కరాలకు పెద్ద ఎత్తున ఘాట్లు నిర్మించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో కలిసి మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి అధికారులతో కలిసి నాగార్జున సాగర్ వద్ద కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు చూశారు. మహారాష్టల్రోని పశ్చిమ కనుమల్లో మహా బలేశ్వరం కొండల్లో పుట్టి కర్నాటక మీదుగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రవహించే కృష్ణానదికి తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలి పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో కృష్ణా పుష్కరాలకు రూ.825 కోట్లు కేటాయించారు. గత పుష్కరాల్లో మహబూబ్‌నగర్‌లో 17 ఘాట్లు ఉండగా, ఈసారి అదనంగా మరో 35 ఘాట్లు నిర్మించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో గతంలో 11 ఘాట్లు ఉండగా, అదనంగా 23 ఘాట్లు నిర్మించారు. రెండు జిల్లాల్లో మొత్తం 86 ఘాట్లలో పుష్కర స్నానాలకు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలోని పది జిల్లాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. పుష్కర ఘాట్ల సమీపంలోని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ ఆలయానికి మరమ్మత్తులు చేశారు. గోదావరి పుష్కరాలను ప్రశాంతంగా నిర్వహించినట్టుగానే కృష్ణా పుష్కరాలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

2017 దసరా నాటికి
యాదాద్రి నిర్మాణం పూర్తి

కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం

యాదగిరిగుట్ట, జూలై 19: మహిమాన్విత క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్థానం 2017 దసరా నాటికి నిర్మాణం పూర్తి చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయస్తామని వైటిడిఎ వైస్‌చైర్మన్ జి.కిషన్‌రావు తెలిపారు. మంగళవారం సాంకేతిక కమిటీ సభ్యులు ఉస్మానియా యూ నివర్సిటీ సివిల్ ఇంజనీర్ బాబురావు, రమేష్‌రెడ్డి, వైటిడిఎ బృందం, ఆర్కిటెక్ట్ ఆనందసాయి బృందం, స్థపతి సౌందరరాజన్, వలినాయగం, నాగలింగం, ఆలయ ఈఓ ఎన్. గీత, చైర్మన్ బి.నర్సింహ్మమూర్తి తదితరులు యాదాద్రి ప్రధాన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కిషన్‌రావు మాట్లాడుతూ అన్ని అనుకూలిస్తే 2017 దసరా నాటికి ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు స్వయంభూదర్శనాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కొండపైన విమాణ గోపురంతో కలిపి 7 గోపురాలు, నాలుగు మాడవీధులు ఉండే విధంగా ఆలయాన్ని నూతన హంగులతో నిర్మిస్తున్నా మ న్నారు. 2.33 ఎకరాల స్థలంలో ఆగమ శాస్త్ర పద్ధతులకు అనుగుణంగా ఆలయ నిర్మాణం ఉంటుందన్నారు. గుహలో కొలువైన మూలవిరాట్ యధావిధిగానే ఉంటుందని, ధ్వజస్థంభం ఈవల నుండి మాత్రమే ఆలయ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. శిల్పాలకు ఉపయోగించే రాయిని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, ఖమ్మవారి పాలెం నుండి తెప్పించినట్లు చెప్పారు. హైదరాబాద్ కోహెడ, కూకట్‌పల్లి వద్ద శిల్పులతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. తిరుపతికి ధీటుగా యాదాద్రి నిర్మాణం ఉంటుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్దానం 1.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం ఉన్నదని యాదాద్రి దేవస్థానం 2.3 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ సన్నిధిలో యాగశాల, రామానుజకూటమి, కళ్యాణ మండపం, అద్దాల మండపం తోపాటు వివిధ విభాగాలు ఉంటాయన్నారు. రిటైనింగ్‌వాల్ నిర్మాణ క్రమంలో అనేక చెట్లు కూల్చుతున్నారని, చెట్లు కూల్చడం వల్ల యాదగిరికొండ సహజత్వం దెబ్బతింటుందని విలేఖ రులు ఆయనను ప్రశ్నించగా ఇక మీదట తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం అధికార్లు ఇఇ దయాకర్ రెడ్డి, డిఈ మహిపాల్‌రెడ్డి, ఎ ఈఓలు ఆకునూరి చంద్రశేఖర్, దోర్భల భాస్కర్‌శర్మ, వేముల రామ్మోహన్ పాల్గొన్నారు.

సింగరేణి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
7 ఎల్‌ఇపి గనిలో ఊపిరాడక కార్మికుడు మృతి
గని కార్మికుల ఆందోళ

గోదావరిఖని, జూలై 19: తండ్రి మరణాంతరం సింగరేణి ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగి... తీరా ఆ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం తీరకముందే ఈ ఇంటి పెద్ద దిక్కును సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతో మృత్యువు కబళించింది. సింగరేణి ఆర్జీ-1 పరిధి 7 ఎల్‌ఇపి బొగ్గు గనిలో మంగళవారం ఉదయం షిఫ్ట్‌లో మింగబోయిన అనిల్ కుమార్ (23) అనే బదిలీ వర్కర్ పని స్థలంలో ఊపిరాడక మృతి చెందాడు. గనిలో ప నులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా ఊపిరాడక కుప్పకూలిపోవడంతో తోటి కార్మికులు గనిపైకి తీసుకువచ్చే సరికే మృత్యువాత పడ్డాడు. దీంతో తోటి కార్మికులు మృతదేహాన్ని గని ముఖ ద్వారం ముందు పెట్టి ఆందోళన దిగారు. కార్మికుని మృతితో నిరసనగా తోటి కార్మికులంతా విధులను బహిష్కరించారు. గని అధికారుల నిర్లక్ష్యానికి కార్మికుడు బలి కావడంతో తోటి కార్మికులు ఒక్కసారిగా గర్జించారు. గడిచిన రెండు నెలలుగా 7 ఎల్‌ఇపి గనిలోని పలు పని స్థలాల్లో వెంటిలేషన్ సక్రమంగా లేదని జిఎంతోపాటు ఇతర గని ఉన్నతాధికారులకు, రక్షణ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని... ఫలితంగా కార్మికుని నిండుప్రాణాన్ని పొట్టన బెట్టుకునేలా చేశారంటూ కార్మికులు ఆగ్రహించారు.

చురుకుగా సోలార్ పవర్ పార్క్ పనులు

100 కోట్లతో నిర్మాణం 20 మెగావాట్ల ఉత్పత్తి
ఆగస్టులోగా నిర్మాణం పూర్తి మెదక్ జిల్లాలో మరో రెండు ప్లాంట్లు
పూర్తయతే పలు మండలాలకు నిరంతర విద్యుత్

నందిపేట, జూలై 19: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వనె్నల్(కె) గ్రామ శివారులో సోలార్ పవర్ పార్క్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహారాష్టల్రోని పుణెకు చెందిన ఉజ్వల తేజస్ ప్రైవేట్ కంపెనీ వారు తెలంగాణ ప్రభుత్వ అనుమతితో ఈ పవర్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వనె్నల్(కె) శివారులో రైతులకు చెందిన 85 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సుమారు 100 కోట్ల రూపాయలతో ఈ పార్క్ నిర్మిస్తున్నట్లు క్షేత్ర మేనేజర్ హరీశ్ వంజారి తెలిపారు. ఈ సోలార్ పవర్ పార్క్‌లో ప్రతిరోజు 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. గడిచిన ఐదు మాసాలుగా పవర్ పార్క్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పార్క్‌లో ఒక్క ప్లేట్ 260 వాట్స్ ఉత్పత్తి శక్తి గల 90 వేల సోలార్ ప్లేట్స్ బిగిస్తున్నారు. ఈ సోలార్ పవర్ పార్క్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు సరఫరా చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఉజ్వల తేజస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. నందిపేట మండల కేంద్రంలోని ట్రాన్స్‌కోకు చెందిన 132/33 సబ్ స్టేషన్‌కు అనుసంధానం చేస్తామన్నారు. ఇందులో భాగంగా పవర్ పార్క్ నుండి నందిపేట సబ్ స్టేషన్ వరకు ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్స్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మూడు సోలార్ పవర్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని, వీటిని మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంటతో పాటు నందిపేట మండలం వనె్నల్(కె)లలో నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. ఆగస్టు నెలాఖరు లోగా సోలార్ పవర్ పార్క్ నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఈ పవర్ పార్క్ పూర్తయి ట్రాన్స్‌కోకు సోలార్ విద్యుత్ సరఫరా జరిగితే 132/33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని మాక్లూర్, నవీపేట, నందిపేట మండలాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

నందిపేట మండలం వనె్నల్(కె) గ్రామ శివారులో చురుగ్గా సాగుతున్న సోలార్ పవర్ పార్క్ పనులు

పుష్కరాల్లోభక్తులకు
ఇబ్బందులు కలిగితే సహించం

అధికారులు సమన్వయంతో పనులు చేయాలి
పుష్కరఘాట్లలో హోం మంత్రి నాయిని ఏరియల్ సర్వే

గద్వాల, జూలై 19: వచ్చేనెలలో జరిగే కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. మంగళవారం కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న పుష్కరఘాట్ల పనులను హెలిక్యాప్టర్ ద్వారా హోంమత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్‌శర్మ, డిఐజి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, ఎస్‌పి రెమా రాజేశ్వరి బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి బృందం సాయంత్రం 4 గంటల సమయంలో గద్వాల పిజెపి హెలిప్యాడ్‌లో దిగారు. ఈ సందర్భంగా పిజెపి క్యాంప్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అక్కడి నుంచి పిజెపి అతిధిగృహానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా పోలీస్ యంత్రాంగం హోంమంత్రికి గౌరవ వందనం అందించారు. అనంతరం పిజెపి అతిధిగృహంలో కృష్ణాపుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి, నిధుల మంజూరు, శాఖల సమన్వయం, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, ఎంపిపి సుభాన్, నాయకులు బిఎస్ కేశవ్, చెన్నయ్య, కోటేష్, విజయ్ తదితరులు హోంమంత్రికి బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. ఇదిలావుండగా హోంమంత్రిని కలిసి గద్వాల జిల్లా విషయంపై వివరించగా ఇప్పుడు సమయం కాదని దాటవేస్తూ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్న హోం మంత్రి నాయిని, డిజిపి అనురాగ్‌శర్మ. గద్వాల పిజెపి హెలిప్యాడ్‌లో దిగుతున్న హెలిక్యాప్టర్

ప్రతి స్కూలుకూ పేరెంట్స్ కమిటీ

నెలాఖరులో విసిల నియామకం ఫీజులను నియంత్రిస్తాం
ఇప్పటికే స్కూళ్లకు నోటీసులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 19: తెలంగాణలోని అన్ని స్కూళ్లలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, హైకోర్టు విధించిన స్టే ఎత్తివేస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకు వచ్చిన ఆయన మంగళవారం నాడు విద్యాశాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలపై భారం పడకూడదన్నదే ప్రభుత్వం అభిమతమని అన్నారు. అధిక ఫీజులు వసూలుచేస్తున్న పాఠశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 ఇంటర్నేషనల్ స్కూళ్లు, 162 ప్రైవేటు స్కూళ్లకు నోటీసులు ఇచ్చామని ఆయన వెల్లడించారు. అఫిలియేషన్‌పై కోర్టును ఆశ్రయించిన 70 ఇంజనీరింగ్ కాలేజీలకూ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూలును యథాతథంగా అమలుచేస్తామని చెప్పారు. ఈ నెలాఖరులో ఉప కులపతుల నియామక ప్రక్రియ కూడా పూర్తిచేస్తామని అన్నారు. పిఎలు, పిఎస్‌లుగా టీచర్లు పనిచేస్తున్న అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 42 మంది టీచర్లు పిఎ, పిఎస్‌లుగా పనిచేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. హైకోర్టులో స్టే తొలగిపోగానే ఫీజుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంతవరకూ ఇంజనీరింగ్ కాలేజీల్లో 66వేల అడ్మిషన్లు పూర్తి చేశామని చెప్పా రు. ఈ నెలాఖరులోగా స్కూళ్లలో విద్యాసహాయకుల నియామకాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.