కృష్ణ

సమన్వయంతో పనిచేసి సంచలనం సృష్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్) ఆగస్టు 24: కృష్ణా పుష్కరాలు 12రోజులు పాటు అత్యంత ఉత్సాహభరితంగా దిగ్విజయంగా జరగటం టీమ్‌వర్క్‌కు కారణమని సియం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. స్ధానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం బుధవారం ఉదయం పుష్కరాల్లో విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించే కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సియం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ 3జిల్లాల్లో సిబ్బంది తమ సొంతపనులుగా విధులు నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయటంలోకీలకపాత్ర వహించారన్నారు. పుష్కరాలకు వచ్చిన యాత్రికులు సంతృప్తి చెందటమే కాకుండా ఏర్పాట్లు బాగున్నాయి అనుకుండా చాలా బాగున్నాయని అని సిబ్బందిని సియం మెచ్చుకున్నారు. చిన్న , పెద్ద అనే బేధం లేకుండా అధికారులు పనిచేసారని, తాను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినప్పటికీ పుష్కర యాత్రికులనుండి ఎటువంటి పిర్యాదులు అందలేదన్నారు. శానిటేషన్ సిబ్బంది నుండి డిజిపి స్ధాయి అధికారి వరకు చాలా నిబద్ధతగా టీమ్‌ల వారీగా విధులు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఈఅభినందన కార్యక్రమంలో 3జిల్లాల అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. విధులు నిర్వహించిన ప్రతి ఉద్యోగి అప్యాయంగా పలకరిస్తూ భుజం తట్టి ప్రశంసల పత్రాలు అందచేసారు. దాదాపు 5గంటలుపాటు జరిగిన ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రతి డిపార్టమెంట్ ప్రతినిధులతో పోటోలకు పోజులులిస్తూ వారిని ఉత్సాహ పర్చారు. సిబ్బంది సైతం సియంతో పోటీలు దిగ్గేందుకు పోటీ పడ్డారు. తర్వాత సియం విధులు నిర్వహించిన ఉద్యోగులకు అవార్డులు అందచేయటంతోపాటు,ఎండోమెంట్స్ మునిపల్, ఆర్టీసీ, పోలీస్‌శాఖ,ల పనితీరును కొనియాడారు. రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు,సిటీ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఎండోమెంట్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జెవియస్ ప్రసాద్, కమిషనర్ వైవి అనూరాధ, పంచాయిత్‌రాజ్ కమిషనర్ బి రామాంజనేయులు, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సమాచారశాఖ కమిషనర్ యస్ వెంకటేశ్వర్, ఐటి జాయింట్ సెక్రటరీ ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ బాబు ఎ, గుంటూరు కలెక్టర్ కాంతిలాల్‌దండే, కర్నూలు కలెక్టర్ విజయ్‌మోహన్, దుర్గగుడి సూర్యకుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు,నగరపాలక సంస్ధ కమిషనర్ జి వీరపాండియన్, గుంటూరు మున్సిపల్ కమీషన్ నాగలక్ష్మీ, సబ్‌కలెక్టర్ డాక్టర్ జి సృజన, లక్ష్మీషా,వివిధ శాఖలకు చెందిన అధికారులను సిబ్బందికి అవార్డులను ఇచ్చి అభినందించారు.