తెలంగాణ

ఆలయాల్లో ఆధ్యాత్మికతను మరింత పెంపొందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 24: రాజకీయ నాయకులకు పునరావాస వేదికలుగా మారిన హిందూ దేవాలయాలను పరిరక్షిస్తామని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. హిందూ దేవాలయాల్లో అధ్యాత్మికతను మరింత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తోందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవాల ప్రారంభ వేడుకలకు ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి హిందూ ఆలయాలకు విముక్తి కలిగించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడు సత్యపాల్ సింగ్ నేతృత్వంలో బిల్లు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. దేశంలోని హిందూ ఆలయాల ప్రతిష్టను పెంచుతూ వాటి పరిరక్షణకు అవసరమైన విధివిధానాలను రూపొందిస్తామన్నారు. ఆలయాల్లో ధర్మ ప్రచారం జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందూ జాగరణతో పాటు బడుగు, బలహీన వర్గాలు ఆలయాల్లో దేవుడిని దర్శించుకునేలా మార్పులు జరుగుతాయని తెలిపారు. రామ మందిర నిర్మాణం కోసం దేశంలో వందలాది మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని పరిపూర్ణానందస్వామి వివరించారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి