ఆంధ్రప్రదేశ్‌

‘పాజిటివ్స్’ కనిష్టమే.. అయినా ఆందోళనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 13: కరోనా (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదైనా ప్రజలను భయం వెంటాడుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోయినా, కాంటాక్ట్ ట్రేసింగ్ (పాజిటివ్ వ్యక్తి కలిసిన వ్యక్తులు, వారు ఎవరెవరిని కలిశారన్న వివరాల సేకరణ) ద్వారా కొత్త కేసులు బయటపడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలను పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అనుమానితులను క్వారంటైన్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 15 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇంకా 13 పాజిటివ్ కేసులుండగా, వారందరికీ ఐసోలేషన్ వార్డులు, కోవిడ్-19 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అనంతపురం, హిందూపురం, కొత్తచెరువు, కల్యాణదుర్గంలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో రెడ్ జోన్లను అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో కొత్త కేసులు వెలుగు చూస్తాయేమోనన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇక అక్కడి పరిస్థితులను బట్టి ఆరంజ్, గ్రీన్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మొత్తం 33 కరోనా సెంటర్లలో అనుమానితులను క్వారంటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అనుమానితుల నుంచి శ్యాంపిల్స్ సేకరణ నిమిత్తం రెవెన్యూ డివిజన్‌కు 3 చొప్పున మొత్తం 18 ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకూ 1221 శాంపిల్స్ తీయగా, రోజుకు 90 వరకూ ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది.
అయితే శ్యాంపిల్స్ టెస్టింగ్ వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని వీఆర్‌డీఎల్ కేంద్రంలో రోజుకు 310 శ్యాంపిల్స్ పరిశీలించేలా చర్యలు చేపట్టారు. అనంతపురంలోని వీఆర్‌డీఎల్‌లో 70, బత్తలపల్లి ఆర్డీటీలో ప్రాథమికంగా 240 శ్యాంపిల్స్ టెస్ట్ చేసేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ మొత్తం 41 శాంపిల్స్ నెగెటివ్ వచ్చాయి. సోమవారం 30 శ్యాంపిల్స్ కూడా నెగెటివ్ వచ్చాయి. కాగా 7 రోజుల పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నారు. వీటిలో హైరిస్క్, మీడియం రిస్క్, లోరిస్క్ వారీగా జాబితాలను శరవేగంగా తయారు చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాజిటివ్ కేసుల్లో తీవ్ర అనారోగ్యానికి గురైతే వారిని నెల్లూరు, తిరుపతికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓపీ సేవలను ప్రారంభించారు. దీంతో రోగులు సామాజిక దూరం పాటిస్తూ ఆసుపత్రి వద్ద క్యూ కట్టారు. ఒక్కొక్కరుగా రోజులుగా లోపలకి వదులుతుండడంతో ఆసుపత్రి బయట చాంతాడంత క్యూ కనిపించింది.
*చిత్రం... అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు బారులుతీరిన ఓపి రోగులు