తెలంగాణ

ఎవరికి భయపడి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఎవరినీ ఉపేక్షించాల్సిన పనిలేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే భరోసా ఇచ్చినా, పాతబస్తీవైపు యంత్రాంగం ఎందుకు కదలడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పాతబస్తీలో కూల్చివేతలు కనిపించక పోవడంతో సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ప్రాంతంలో 28.6వేల అక్రమ నిర్మాణాలు నాలాలపైనే ఉన్నాయన్నది ఏడేళ్ల క్రితంనాటి గ్రేటర్ నివేదిక. వీటిలో 45శాతం పాతబస్తీలోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అసాధారణ వర్షాలతో హైదరాబాద్ అల్లకల్లోలమైన దరిమిలా, ఆక్రమలణ కూల్చివేత ఆపరేషన్ మొదలైనా అవన్నీ కొత్త నగరానికే పరిమితమైందన్నది నిర్వివాదాంశం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయ్యప్ప సొసైటీ కూల్చివేతల సమయంలోనూ పాతబస్తీలోని అక్రమ కట్టడాలపై యంత్రాంగం దృష్టి పెట్టలేదు. అక్కడ చెరువు స్థలంలో సినీహీరోకు చెందిన ఫంక్షన్‌హాల్ ఉందన్న ఆరోపణలు నేపథ్యంలో, కూల్చివేతపై ప్రచారార్భాటం సాగినా తరువాత ప్రభుత్వం వౌనం వహించింది.
తాజాగా పాతబస్తీలోని చెరువులు, నాలలపై అధికశాతం ఆక్రమణలున్నా, ఆ ప్రాంతంవైపు యంత్రాంగం కదలకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణలను విడిచిపెట్టి, కూల్చివేతలు కొత్త నగరానికి పరిమితం చేయడమేంటన్న ప్రశ్న ఉద్భవిస్తోంది. పాత నగరంలో 80 శాతం రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురైనా అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలకు జవాబు లేదు.
అధికారుల లెక్కల ప్రకారం 393 కిలోమీటర్ల మేర వరద నీరు ప్రవహించాల్సి ఉంది. 160 చెరువులుండగా, వాటిలో 5 ప్రధాన చెరువులు, 12 మధ్య, చిన్నతరహా చెరువులున్నాయి. కానీ పాతబస్తీ ఆక్రమణలను పరిశీలిస్తే ఆ లెక్క ఎంత తగ్గిందో కూడా అధికారుల వద్ద అంచనా లేదు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఎక్కువగా చెరువులే కబ్జా అయ్యాయి. వీటిలో కోర్టు కేసులూ ఉన్నా, వాటిని వెకేట్ చేయించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకూ చొరవ చూపిన పాపాన పోలేదు. పాత నగరంపై ప్రభుత్వం స్పందించక పోవడానికి కారణం అక్కడ ఒక వర్గానికి భయపడటమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వమున్నా పాతబస్తీ కేంద్రంగావున్న ఒక రాజకీయ పార్టీకి భయపడి వారి జోలికి వెళ్లటం లేదని, కొత్త నగరం నుంచి వసూలు చేస్తున్న పన్నులను పాతబస్తీకి తరలిస్తూ ప్రభుత్వాలు పన్నులు కడుతున్న వారికి అన్యాయం చేస్తున్నాయన్న విమర్శలు దశాబ్దాలుగా విమర్శలుగానే ఉండిపోతున్నాయి. ‘చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సబబే. కానీ పాతబస్తీలోని అక్రమ కట్టడాలు ఎందుకు కూల్చడం లేదో ప్రభుత్వం జవాబుచెప్పాలి. అక్కడ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్టీకి ప్రభుత్వం భయపడుతుందా? కొత్తబస్తీకి ఒక నిబంధన, పాతబస్తీకి ఒక నిబంధన ఉంటుందా? అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణి నిలదీశారు.
ఇదిలావుంటే, కొత్త నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంటే, తెరాస నేతల్లో దిగులు కనిపిస్తోంది. కూల్చివేతల ప్రాంతాల్లో బాధితుల నుంచి పెరుగుతున్న వొత్తిడే ఇందుకు కారణం. నిర్మాణాలు జరిగే సమయంలో ‘కలెక్షన్ల’కు పాల్పడిన వాళ్లంతా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని, మా కష్టం ఎవరికి చెప్పుకోవాలంటూ బాధిత వర్గం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

చిత్రం... రాజధాని నగరంలో బుధవారమూ
కొనసాగిన ఆక్రమణల కూల్చివేతలు