కృష్ణ

రాని హోదా కోసం జగన్ రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, అక్టోబర్ 26: ప్రత్యేక హోదా విషయంలో రాజ్యాంగపరంగా సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని మచిలీపట్నం ఎంపి కొనకళ్ళ నారాయణ అన్నారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందన్నారు. ఈనేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని అంటూ రాని ప్రత్యేక హోదాపై ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. జగన్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుత్తా చంటి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 26: కోస్తా ఆంధ్రాకు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా తీరప్రాంత అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని బుధవారం రాత్రి ఒక ప్రకటనలో కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాజా హెచ్చరికలు వెలువడే వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని కలెక్టర్ కోరారు. కంట్రోల్ రూమ్‌లో 08672252572 నంబర్ ఫోన్ ఏర్పాటు చేశారు. తీరప్రాంత మండలాలైన బందరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి తహశీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు వివరించారు.