తెలంగాణ

మిలీనియం జోక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం మద్దతు ధరపై హరీశ్ ఎద్దేవా
7 వేలు అడిగితే ముష్టి 5 వేలా?
కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ

హైదరాబాద్, మే 4:మిర్చి కొనుగోళ్లకోసం కేంద్రం ప్రకటించిన మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకాన్ని మిలీనియం జోక్‌గా మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. మిర్చి కొనుగోళ్ళపై అస్పష్టమైన విధానంతో రైతులకు కేంద్రం శఠగోపం పెట్టిందన్నారు. ఉత్తమ రకం మిర్చికే మద్దతు ధర వర్తింపజేస్తే మిగిలిన రకాల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. హరీశ్‌రావు గురువారం తెలంగాణ భవన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం 3,37,000 క్వింటాళ్లను మాత్రమే కొంటాననడంలో ఔచిత్యమేమిటని ఆయన ప్రశ్నించారు. రైతుల వద్ద ఇంకా 35 లక్షల క్వింటాళ్ల మిర్చి ఉందనీ, దాని మాటేమిటన్నారు. తేజ రకం మిర్చి ధర ఆరువేల నుంచి ఆరున్నర వేల వరకూ ఉంటే, ఐదు వేల మద్దతు ధర ప్రకటించడమేమిటన్నారు. ఇది రైతులను ఆదుకోవడానికా, ముంచడానికా అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలోని బిజెపి నేతలు పది వేలు మద్దతు ధర ఇవ్వాలని కోరుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. మిర్చి రైతుల్ని కేంద్రం ఆదుకోవాలంటూ టిఆర్‌ఎస్ ఎంపి వినోద్‌కుమార్ మార్చి 30న కేంద్ర వ్యవసాయ మంత్రికి వినతిపత్రం ఇచ్చారని, 31న వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, 1న స్వయంగా తాను లేఖలు రాశామని హరీశ్‌రావు వివరించారు. ఈ లేఖల్లో స్పష్టత లేదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అనడం విడ్డూరమన్నారు. ఈ లేఖలపై స్పందించడానికి కేంద్రానికి నెల రోజులు ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎఫ్‌సిఐ, నాఫెడ్ సంస్థలను రంగంలోకి దింపి ఏడు వేల రూపాయలకు పైగా మద్దతు ధరతో మిర్చిని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌కు లేఖ రాశారు.