తెలంగాణ

కాళేశ్వరం చకచకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు
రిట్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
భూ సేకరణకు తొలిగిన ఇబ్బందులు
తీర్పును స్వాగతించిన ప్రభుత్వం

హైదరాబాద్, మే 6: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన రిట్ పిటిషన్‌ను వెకేషన్ హైకోర్టు శనివారం కొట్టివేసింది. ప్రాజెక్టు పనులు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం కోసం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం 240 ఎకరాల భూమిని సేకరించారు. భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తున్నారని వెంకటరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేయాలన్న వెంకటరెడ్డి పిటిషన్‌ను కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ కొట్టివేశారు. భూనిర్వాసితుల నష్టపరిహారం, పునరావాస చర్యలకు సంబంధించి తమ ఫిర్యాదులను ఆర్ అండ్ ఆర్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. పిటిషనర్ తరఫున రచనారెడ్డి కేసు వాదించారు. సుందిళ్ళ బ్యారేజీ పరిధిలోని గోలివాడ గ్రామానికి చెందిన భూములను 2013 చట్టం ప్రకారం ప్రభుత్వం సేకరించింది. దీనికోసం 19 కోట్ల రూపాయలను ప్రభుత్వం డిపాజిట్ చేసినట్టు అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. 240 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులు చేపట్టాలని ఏప్రిల్ 26న చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ తప్పుబట్టారు. తుది తీర్పు వచ్చేంతవరకు రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవద్దని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం తరఫున వాదించిన శరత్‌కుమార్, ప్రభుత్వం సేకరించిన 240 ఎకరాలు మొత్తానికి పిటిషనర్ సొంతదారు కాదని, పరిహారం కోసం 19కోట్లు ప్రభుత్వం డిపాజిట్ చేసిందని, భూమి సొంతదారులు ఆ పరిహారం తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూసేకరణ జరపవద్దని కోర్టు చెప్పలేదని న్యాయమూర్తి చెప్పారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ జరిపి, అవసరమైన డబ్బు డిపాజిట్ చేయడం, పరిహారంగా ఎక్కువమంది రైతులు ఆ డబ్బులు తీసుకోవడాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు.
ఇకవేగంగా కాళేశ్వరం పనులు
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుతో నీటిపారుదల శాఖ సంతృప్తి వ్యక్తంచేసింది. ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయినట్టేనని, ఇక పనులు వేగవంతం చేయనున్నట్టు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 40 నుంచి 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాశ్ తెలిపారు. విపక్షాలు కేసులు వేస్తూ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే ప్రయత్నాలు మంచిది కాదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే తెలంగాణకు అంత ప్రయోజనకరమని అన్నారు. ప్రాజెక్టులతోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందని చెప్పారు. తక్కువ భూమి ముంపునకు గురయ్యే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినట్టు తెలిపారు.