తెలంగాణ

తొలకరికి జలాశయాలు కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జూన్ 11: నిన్నమొన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తొలకరి వర్షాలు ఉపశమనం కలిగించాయి. మృగశిరకార్తె ప్రవేశం నుండి మూడు రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడగా చెరువులు, జలాశయాల్లోకి భారీ గా వరదనీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆసిఫాబాద్, బేల, దండేపల్లి, జన్నారం మండలాల్లో రోడ్లు దెబ్బతినగా మహ్మాదబాద్ వద్ద వంతెన కింది అప్రోచ్‌రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోవడంతో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆదివారం రాకపోకలు స్థంభించిపోయాయి. దీం తో అత్యవసర సర్వీసులు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బేల వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. జన్నారం మండలం తపాలపూర్, దండేపల్లి వద్ద భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగడంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ పను లు ఒక్కసారిగా ఊపందుకోగా మృగశిరకార్తె రోజే ఆదిలాబాద్, ఉట్నూరు బోథ్ డివిజన్లకు చెందిన రైతులు పత్తి విత్తనాలను నాటడంతో రైతుల్లో ఆనందానికి అవదులు లేకుండాపోయింది. తొలకరి వర్షాలు తమకు ఈసారి అనుకూలించాయని రైతు సంబరాలు చేసుకుంటున్నారు.