తెలంగాణ

ఐలయ్య ధోరణి మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు ప్రొ. ఐలయ్య వైశ్యులపై రాసిన వివాదాస్పద పుస్తకం, వ్యాఖ్యలు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వైశ్యుల ఆగ్రహాన్ని చవిచూడటంతో పాటు వారిలో ఐక్యతను మరింతగా పెంచాయని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఎవరి మీదనైనా కోపతాపాలు ఉంటే వ్యక్తిగత విమర్శలు చేయాలే తప్ప ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఐలయ్య వంటి వారికి తగదని అన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చిన రోశయ్య ఆర్ అండ్ బి అతిథిగృహంలో తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతిసేలా పుస్తకం రాయటంతో పాటు కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన ఐలయ్య ధోరణి మార్చుకుంటారని తాను వేచి చూశానన్నారు. కానీ ఆయన ధోరణిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటివరకు ప్రొ. ఐలయ్య వర్సెస్ వైశ్యులుగా ఉన్న వివాదం నేడు కులాల మధ్య అంతరాన్ని పెంచేలా మారిందని రోశయ్య వ్యాఖ్యానించారు. ఐలయ్య వ్యాఖ్యలను ఉభయ తెలుగు రాష్ట్రాల వైశ్యులతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని వైశ్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. వైశ్యులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని హుందాతనాన్ని కాపాడుకోవాలని తాను ఓ స్నేహితునిగా ఐలయ్యకు విజ్ఞప్తి చేస్తున్నానని రోశయ్య చెప్పారు.