కృష్ణ

మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): పట్టణంలోని పలు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిఎంఎస్ అండ్ ఎస్‌విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పదవ అదనపు జిల్లా జడ్జి స్వర్ణలత మాట్లాడుతూ స్ర్తిలు చిన్న, చిన్న సమస్యలకు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వివేకంతో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. జడ్జి స్వర్ణలత, డా. బి శైలజ, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. శ్రీవిద్యలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొ. సూర్యప్రకాశరావు, ఇసిఇ విభాగాధిపతి సిహెచ్ శాంతిరాణి, తదితరులు పాల్గొన్నారు. హిందూ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో డా. చంద్రలీల, డా. మంజులత, డా. సుజాత, డా. సత్యలత, డా. రజినిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి ఉషారాణి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. రవితేజ, తదితరులు పాల్గొన్నారు. స్వాతి హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఇనగుదురు పోలీసు స్టేషన్ ఎఎస్‌ఐ పుష్పను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రోహిణి, కౌన్సిలర్ ఎస్ ధనలక్ష్మి, విఎన్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మ సమాజం, వైజ్‌మెన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిడిపి రాష్ట్ర నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు మాట్లాడుతూ ప్రేమించమని మహిళలపై జరిగే యాసిడ్ దాడులను, లైంగిక వేధింపులను రూపుమాపడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా ఎస్‌బిఐ బజారు శాఖ చీఫ్ మేనేజర్ విజయశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రి యునాని మెడికల్ ఆఫీసర్ డా. నస్రిన్ జహాన్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కూరాళ్ళ రామచంద్రరావు, డా. శ్రీనివాసరావు, ఎన్‌జికె శాస్ర్తీ, ఫిన్‌ల్యాండ్ దేశస్థులు, ఎల్ మోజెస్, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా స్వామివారి రథోత్సవం
మోపిదేవి, మార్చి 8: దక్షిణ కాశీగా పేరొందిన కళ్ళేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ధర్మకర్తలు శ్రీమంతు రాజా యార్లగడ్డ పద్మనాభ ప్రసాద్ ప్రారంభించారు. రథోత్సవ ప్రారంభ సూచకంగా పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. స్వామివారి రథోత్సవం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, తీన్‌మార్ డప్పుల వాయిద్యాలతో ఆలయ ప్రధాన అర్చకులు బద్దు కుమారస్వామి అర్చకత్వంలో అర్చకులు వరప్రసాద్ శర్మ, రుత్వీకుల వేద మంత్రోచ్ఛారణల మద్య వైభవంగా నిర్వహించారు. భక్తులతో కళ్ళేపల్లి గ్రామం కిక్కిరిసింది. అవనిగడ్డ సిఐ చంద్రశేఖర్, చల్లపల్లి సిఐ వైవి రమణ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్‌ఐలు, 30 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. స్వామివారి రథాన్ని సప్తవర్ణ శోభితమైన విద్యుత్ దీపాలతో 20 అడుగుల ఎత్తున ప్రత్యేకంగా అలంకరించారు. కాగా, శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి జగాజ్యోతి కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కుమారస్వామి అర్చకత్వంలో రుత్వీకుల వేద మంత్రోచ్ఛారణలతో స్వామివారి ఆలయ మండపంలో ప్రత్యేక గుండంలో 300 కిలోల ఆవునెయ్యితో జాగాజ్యోతి ప్రజ్వలనను ఆలయ అనువంశీక ధర్మకర్త శ్రీమంతు రాజా యార్లగడ్డ పద్మనాభ ప్రసాద్ గావించారు. యార్లగడ్డ వంశీయులు శివరామప్రసాద్, సత్యజిత్ ప్రసాద్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసి ఎం శారదాకుమారి, ఆలయ సూపరింటెండెంట్ పి చన్నకేశవ, మధుసూదనరావు, రామకృష్ణ, అధికారులు, సర్పంచ్ అర్జా వెంకట సుబ్బారావు, వైస్ ఎంపిపి అర్జా శివసుబ్రహ్మణ్య ప్రసాద్, ఎంపిడివో బిఎం లక్ష్మీకుమారి, విఆర్‌ఓ అర్జా వెంకటేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఫొటో(8ఎంవైఎంపిహెచ్ 2): దుర్మరణం చెందిన యువకులు
మైలవరం, మార్చి 8: వెల్వడం తిరునాళ్లకు వెళ్ళి తిరిగివస్తూ ఇద్దరు యువకులు అనంతలోకాలకు చేరారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన బలగాని నవీన్(25), కొల్లి జగదీష్(26) అనే యువకులు ఎ కొండూరు మండలం కోమటికుంటలో ఉన్న తమ అమ్మమ్మ ఇంటికి వచ్చి మైలవరం మండలం వెల్వడం తిరునాళ్లు చూసేందుకు బైక్‌పై సోమవారం రాత్రి వచ్చారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. మైలవరం బైపాస్ రోడ్‌లో అటవీ శాఖ కార్యాలయం ఎదురుగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా జగదీష్‌ని మైలవరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ రవికుమార్ వివరించారు.