క్రీడాభూమి

ఎలానో అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, డిసెంబర్ 21: ఇండియన్ సూపర్ లీగ్ (ఐపిఎల్) ఫైనల్‌లో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించి టైటిల్ సాధించిన చెనె్నయిన్ జట్టులో మార్క్యూ ప్లేయర్ ఎలానో బ్లమెర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రెజిల్‌కు చెందిన ఎలానో తనపై దాడి చేశాడని గోవా క్లబ్ సహభాగస్వామి దత్తరాజ్ సాల్గొంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం అతనిని అడిషినల్ సెషన్స్ జడ్జి వినె్సంట్ సిల్వ ముందు హాజరుపరచగా బెయిల్ మంజూరు చేసినట్టు చెప్పారు. చెనె్నయిన్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్న ఎలానో సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు స్వదేశానికి బయలుదేరినట్టు చెనె్నయిన్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. అతనిపై 341, 323, 504 సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారని వివరించింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత చెనె్నయిన్ జట్టు విజయోత్సవం జరుపుకొంటున్న సమయంలో సంఘటన చోటు చేసుకున్నట్టు దత్తరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవా జట్టులోని మిగతా సభ్యులతోపాటు, మరో సహ భాగస్వామి శ్రీనివాస్ డెంపో సమక్షంలో ఎలానో తనపై దాడికి దిగాడని ఆరోపించాడు. మైదానంలో చెనె్నయిన్ ఆటగాళ్లు తిరుగుతూ కేరింతలు కొడుతూ, ఎక్కువ సమయం గడపడంతో వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరినట్టు దత్తరాజ్ వివరించాడు. చెనె్నయిన్‌కు చెందిన మిగతా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతుండగా, ఎలానో తనపై దాడికి దిగాడని, మోచేత్తో గట్టిగా పొడిచాడని తెలిపాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దత్తరాజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వెంటనే వారు ఎలానోను అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి వినె్సంట్ సిల్వ ఇంటికి తీసుకెళ్లగా, ఆయన బెయిల్ మంజూరు చేశాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే అతను స్వదేశానికి పయనమయ్యాడు.