ఈ వారం స్పెషల్

ట్రంపు.. అతడి దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంబరమా.. సంశయమా.. భయమా.. ద్వేషమా.. అమెరికానే కాదు, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ట్రంప్ నాదమిది! సరికొత్త ‘స్వదేశీ’ నినాదంతో ఆయన కలకలం రేపుతున్నారు. స్వేచ్ఛావిపణికి పట్టుగొమ్మగా నిలిచిన అమెరికాను మళ్లీ ‘రక్షిత వాదం’లోకి నెట్టేస్తున్నారు. ఎవరినీ ఖాతరు చేయని ధోరణి, మిత్రుల్ని, శత్రువుల్ని సైతం ఒకే గాటన కట్టే వైఖరితో ట్రంప్ విశ్వ వేదికను గడగడలాడిస్తున్నారు.. 19 నెలల్లోనే అమెరికా శే్వతసౌధాన్ని సొంతం చేసుకున్న ఒకే ఒక్కడైనా.. ట్రంప్ ఆలోచనలు, విధానాలు ఈ అలజడికి ఆజ్యం పోస్తున్నాయి. సొంత ఇంటెలిజెన్స్‌నే నమ్మకపోవడం, నాటోలోనూ కలవరం రేపడం, ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థి రష్యాతో చెలిమి.. వెరసి అసలు ట్రంప్ ఉద్దేశమేమిటన్నది గందరగోళంగా మారింది. భారత్ వంటి చిరకాల మిత్ర దేశాలతోనూ అగ్రరాజ్య కొత్త అధినేతది ఇదే ధోరణి.. చరిత్ర సృష్టించినా.. మాజీ అధ్యక్షులెవరికీ లేని ఎన్నో ‘్ఫస్ట్’లను చేజిక్కించుకున్నా.. అమెరికా ఫస్ట్ అన్న ట్రంప్ నినాదం ఎంతమేరకు ఫలిస్తుంది? భారత్ సహా అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం కలిగి ఉన్న వారి సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. మొత్తం మీద ట్రంప్ ఎన్నిక అమెరికా ప్రజాస్వామ్య ఉత్సవమా లేక ఆ దేశంలో రగులుతున్న పెను చీలికకు సంకేతమా? రానున్న నాలుగేళ్లూ అమెరికాకే కాదు దానితో సన్నిహితంగా ఉన్న దేశాలకూ కీలకమే!

డొనాల్డ్ ట్రంప్...
ఒక అమెరికానే కాదు, యావత్ ప్రపంచానే్న ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పేరు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ప్రభంజనం ఆయన.

దశాబ్దాలుగా రాజకీయాల్లో వుండి అమెరికాను అన్ని కోణాల్లోనూ ఔపోసన పట్టినవారికే సాధ్యం కాని శే్వతసౌధాన్ని కేవలం 19 నెలల వ్యవధిలోనే ట్రంప్ చేజిక్కించుకున్నారు. వ్యాపారమే ఊపిరిగా, శ్వాసగా, లాభమే పరమావధిగా సాగిన 70 సంవత్సరాల ట్రంప్ జీవితం ఇప్పుడు అమెరికా 45వ అధ్యక్షుడుగా ఏవిధంగా సాగుతుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ఎలా ఉంటాయన్నది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్న అంశం. ఇప్పటివరకు వచ్చిన ఏ అమెరికా అధ్యక్షుడి విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా చర్చ జరగలేదు. ట్రంప్ విషయంలోనే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది. అందుకు కారణం ఏమిటి? అన్నది లోతుగా విశే్లషిస్తే... ఆయన స్వభావం, మాట తీరు, దేన్నైనా సాధించగలిగే పట్టుదల, దేన్నీ లక్ష్యపెట్టని ధోరణి. రిపబ్లికన్ అభ్యర్థిగా అధికారికంగా అసలు ట్రంప్‌కు అవకాశం దక్కుతుందా అన్న సందేహాలనూ, సంశయాలనూ తోసిరాజని అంతిమంగా తానే అధ్యక్షుడ్ని అంటూ మెజారిటీ ప్రజల మన్ననలతో ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ప్రచారం సాగిన కొన్ని నెలలు ఆయన పట్ల సర్వత్రా వ్యతిరేకతే. ముఖ్యంగా మహిళల విషయంలోనూ, చివరకు తన స్వంత కుమార్తె విషయంలో కూడా స్ర్తిల పట్ల ఆయనకున్న చులకన భావానికి అద్దం పట్టినవే. వ్యాపారవేత్తగా ట్రంప్ జీవితం ఎలాగైనా ఉండివుండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలను చేసిన ఘనత ఆయనది కాబట్టి సామాజిక విలువల విషయంలో ఆయన అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ దేశాధ్యక్ష పీఠానికి పోటీపడుతున్న తరుణంలో కూడా అదే ధోరణిని ట్రంప్ ప్రదర్శించడం వల్ల ఆయన పట్ల వ్యతిరేకత అడుగడుగునా ప్రస్ఫుటమైంది. ఇప్పటివరకు 44మంది అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. వీరెవరి విషయంలోనూ ఇంతటి వ్యతిరేకత రాలేదు.
అమెరికా అధ్యక్ష పదవి ప్రత్యేకతే వేరు!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రజాస్వామ్య దేశాలున్నా అమెరికా అధ్యక్ష పీఠానికున్న ఘనత వర్ణనాతీతం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ప్రాబల్యం కలిగిన దేశానికి అధిపతిగా వుండే వ్యక్తి మాటకు ఎంతో విలువుంటుంది. అతని చేతలకూ అంతే పదును ఉంటుంది. ప్రతిదీ శిలాశాసనమే. అందుకే అమెరికా అధ్యక్షుడి మాదిరిగా ఎవరూ ఉండలేరు, ఉండరు కూడా. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి దైనందిన జీవన వ్యవహారాల నుంచి ప్రతిదీ కూడా ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా మీడియాలో హోరెత్తిపోతుంది. మామూలు దేశాల అధ్యక్షులకు సంబంధించి చరిత్ర ఇంతగా నమోదు చేసుకునే అవకాశం ఉండదు. కానీ అమెరికా అధ్యక్షులకు మాత్రం అన్నివిధాలుగా ప్రత్యేకమైన వెసులుబాటే. ఆయన గురించి జీవిత చరిత్రల స్థాయి, ఆత్మకథల స్థాయి, అధ్యక్ష లైబ్రరీలు వెలుస్తాయి... అంతేకాదు ప్రతిదీ కూడా ఆయనకు అత్యధిక స్థాయిలో ప్రచారాన్ని అందించే రీతిలోనే సాగుతుంది. అమెరికా అధ్యక్షుల్లో ఆండ్రూ జాన్సన్ మొట్టమొదటిసారిగా అభిశంసనకు గురైన వ్యక్తి. అంటే, అమెరికా రాజ్యాంగంలో అధ్యక్షుడికి ఎంత విలువ వుంటుందో, అతడు దారితప్పితే అభిశంసనకూ అంతే అవకాశం ఉంటుందన్నది ఇందుకు తార్కాణం. ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ నాలుగుసార్లు ఎన్నికైన ఏకైక అధ్యక్షుడు. అలాగే జాన్ ఎఫ్ కెనడీ మొట్టమొదటి కేథలిక్ అధ్యక్షుడు కాగా, హాలీవుడ్ నుంచి అధ్యక్ష పీఠాన్ని అందుకున్న తొలి నటుడు రొనాల్డ్ రీగన్. ఇటీవలే పదవీ విరమణ చేసిన బరాక్ ఒబామాకు మొట్టమొదటి ఆఫ్రికా అమెరికన్‌గా అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఘనత దక్కింది.
గతంలో ఎన్నడూలేని విధంగా తాజా అధ్యక్ష ఎన్నికలతో అమెరికా నిట్టనిలువునా చీలిపోయింది. అంటే అధ్యక్షుడికి వెన్నుదన్నుగా నిలవాల్సిన దేశ ప్రజల్లోనే చీలికలు వచ్చేశాయన్నమాట. ఇంతగా అమెరికా సమాజం రెండు వర్గాలుగా చీలిపోవడమన్నది దాని అంతర్గత భద్రతకు ఓ సవాలు లాంటిదే. ట్రంప్ ఎన్నికను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్యే కాదు, ఆయన్ను అభిశంసించాలనే డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ ఏకతాటిపై నడిపిస్తూ తాను అందరివాడినని ట్రంప్ ఏ మేరకు నిరూపించుకోగలుగుతారు. ప్రజల్లో తన నాయకత్వ పటిమ పట్ల నిస్పాక్షికత పట్ల నమ్మకాన్ని ఏవిధంగా కలిగిస్తారన్నది వేచిచూడాల్సిందే. ట్రంప్ ఎన్నికతో అమెరికా సమాజం గతంలో ఎన్నడూ లేని రీతిలో చీలిపోయిందా లేక అలా చీలిన సమాజానికే ట్రంప్ సారథ్యం వహిస్తున్నారా అన్నది ఉత్కంఠను కలిగిస్తున్న అంశమే. ఎందుకంటే కాకలు తీరిన విశే్లషకులు సైతం ఊహించని రీతిలో ఆయన అధ్యక్ష పీఠాన్ని అందుకోగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మిస్టరీయా లేక అమెరికా ప్రజలు ట్రంప్ నాయకత్వాన్ని మనసా వాచా కోరుకున్నారా? అన్న వాదనకూ ఆస్కారమిస్తోంది. తాను సృష్టించుకోని పరిస్థితికి ఇప్పుడు ట్రంప్ సారథ్యం వహిస్తున్నారు. అంటే అమెరికాలో చీలికలు ఆయన కోరుకోలేదు. ఇంతగా ప్రజలు విడిపోతారని ఆయన భావించలేదు. కానీ ఎవరూ ఊహించనిదే జరిగింది. ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ఉద్యమాలు, నిరసనలే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఈ ఉద్యమాలకు మహిళలే సారధులు కావడానికి కారణం ట్రంప్ పట్ల వారికున్న వ్యతిరేకతే. దీన్ని ఆయన ఏవిధంగా అధిగమించగలుగుతారు? అమెరికా సమాజం ఒక్కటేనని కలిసికట్టుగానే అగ్రరాజ్య వైభవాన్ని పునరుద్ధరించాలంటూ పిలుపునిచ్చిన ఆయన ఆ లక్ష్యాన్ని సాధించుకునేందుకు అనుసరించే మార్గం ఏమిటన్న దానిపైనే ఆయన విజయం ఆధారపడి ఉంటుంది. ఏవిధంగా చూసినా ట్రంప్ ఎన్నిక అమెరికా సొంతంగా సృష్టించుకున్న ఓ చరిత్ర అయితే, ఆయన వేయబోయే ప్రతి అడుగూ సంచలనాలకు నిలయమే అవుతుందన్న వాదన కూడా సరికొత్త ధోరణులకు అద్దం పట్టేదే. ఒక్క అధ్యక్షుడి విషయంలో ఇంతగా వ్యతిరేకత మేట వేయడం ఎన్నడూ జరగనిదే. ప్రపంచాన్ని మిత్ర దేశాలుగా, శత్రు దేశాలుగా విభజించిన ఘనత అమెరికాది. తన ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించిన అగ్రరాజ్యం అందుకు తగ్గట్టుగానే కొన్ని దేశాలను తనకు అనుకూలంగా మార్చుకుంది. వాటి ద్వారా తన పలుకుబడిని, ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ వచ్చింది. అధికారంలో డెమోక్రాట్లు ఉన్నా, రిపబ్లికన్లు వచ్చినా అమెరికా విధానం మాత్రం ఒక్కటే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వీయ ప్రయోజనాలను కాపాడుకోవడం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ విలువల రక్షణ వంటి అంశాలనూ భుజానికెత్తుకుంది. అన్నివిధాలుగా అభివృద్ధి చెందిన అమెరికాకు మిత్ర దేశాల సంఖ్య తక్కువేమీ కాదు. కారణం అమెరికాకు చేరువైతే అన్నిరకాలుగానూ అభివృద్ధి కనుచూపు మేరలో ఉన్నట్టే.
ఇప్పటివరకు వచ్చిన అమెరికా అధ్యక్షులందరూ కూడా దేశ ప్రయోజనాలే ప్రామాణికంగా ఇతర దేశాలపై పెత్తనం చెలాయించినవారే. కానీ తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మాత్రం అమెరికా మిత్ర దేశాల గుండెల్లో మంటలు రేపుతున్నాయి. శత్రువులకే కాదు, మిత్ర దేశాల్లోనూ ఈ రకమైన పరిస్థితి ఏర్పడిందంటే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనా రీతి ఎవరికీ అంతుబట్టకపోవడమే. ట్రంప్ చెప్పింది చెప్పినట్లు చేస్తే అమెరికా బాగోగుల మాట ఎలా ఉన్నా అది ప్రపంచ దేశాలన్నింటిలోనూ ముసలం పుట్టిస్తుందని ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
రెండో ప్రపంచం ముగిసినప్పటినుంచి అమెరికా ఎప్పటికప్పుడు తమ పెత్తనాన్ని పెంచుకునే దిశగానే వ్యూహాత్మక అడుగులు వేస్తూ వచ్చింది. అనేక సంపన్న దేశాలను జతకట్టి వాటితో సైనిక ఒప్పందాలను కుదుర్చుకుంటూ వచ్చింది. అందుకు కారణం ఈ కూటమిలో ఏ దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా మిగతా దేశాలన్నీ కూడా పిలవకుండానే రక్షణ బాధ్యతను చేపట్టాల్సి ఉండటం. అయితే రాజకీయాలకు ముఖ్యంగా ప్రపంచ రాజకీయాలకు ఇతర దేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాలకు పూర్తిగా కొత్త అయిన ట్రంప్ తనదైన శైలిలోనే మాట్లాడటం, ఈ కూటములన్నీ పనికిరావని చెప్పడం - ఈ దేశాల్లో గుబులు రేపుతోంది. అంతేకాదు, అమెరికా తనంత తానుగానే ఎదగగలిగే నిలబడగలిగే శక్తి అన్న ట్రంప్ మాటలు ఎంతవరకు వాస్తవం? అన్ని విధాలుగా ప్రపంచ సరిహద్దులు చెరిగిపోయి, సంపన్న పేద అన్న తేడా లేకుండా దేశాల మధ్య సహకారమే అభివృద్ధికి కొలమానమైనప్పుడు... మిత్రుల బాసట లేకుండా అమెరికా రాణించగలదా? అన్నది ప్రశ్న. పైగా నాటో దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమ రక్షణకు సంబంధించిన కేటాయింపులను పెంచడం లేదన్న అమెరికా వాదన ఎంతైనా నిజం. బరాక్ ఒబామా కూడా ఇదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నాటోతో అమెరికా సంబంధాలు గతంలో మాదిరిగా కొనసాగుతాయా? లేక రెండో ప్రపంచ యుద్ధ కాలంనుంచి పటిష్ఠమైన శక్తిగా వస్తున్న ఈ కూటమికి తూట్లు తప్పవా? అన్నది కూడా ఆందోళన కలిగించే అంశమే. అదే జరిగితే అమెరికా ప్రాబల్యం తగ్గుతుందన్నది ఎంతైనా వాస్తవం. అదేవిధంగా ఇతర దేశాలనుంచి ఆశించిన రీతిలో అమెరికాకు సహాయ సహకారాలు అందడం కూడా అనుమానమే.
ఆసియా మిత్రులు ఎటు?
ఆసియా ఖండంలోని దేశాలతో ట్రంప్ ఏవిధంగా వ్యవహరిస్తారన్న దానిపైనా అమెరికా ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని దేశాలన్నింటితోనూ సన్నిహిత సంబంధాలను పెంచుకోవడంతోపాటు ఆర్థికంగా, రక్షణపరంగానూ తోడ్పాటునందిస్తూ వస్తున్న చైనా పలుకుబడి అపరిమితమే. ఈ నేపథ్యంలో చైనానుంచి ఈ దేశాలను అమెరికా తనవైపు తిప్పుకునే అవకాశముందా? అధ్యక్షుడుగా తొలి కొన్ని నెలల్లో ట్రంప్ ఏవిధమైన నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపైనే ఆసియా దేశాలతో అమెరికాతో తదుపరి సంబంధాలు ఆధారపడి ఉంటాయి. మొదటినుంచి కూడా జపాన్, దక్షిణ కొరియాలతో అమెరికా సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తూ వస్తోంది. ఇబ్బందల్లా ఉత్తర కొరియాతోనూ, బలమైన అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతున్న చైనాతోనే. అయితే ట్రంప్ చేస్తున్న ప్రకటనలు బట్టి దక్షిణ కొరియాలోనూ, జపాన్‌లోనూ ఆందోళన మొదలైంది. తమతో రక్షణ సంబంధాలను గతంలో మాదిరిగానే అమెరికా కొనసాగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఈ దేశాలకు పట్టుకున్న భయం. అలాగే ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ ఈ రకమైన సందేహాలే తీవ్రమవుతున్నాయి. మొత్తంమీద ట్రంప్ రాకతో అమెరికా మిత్ర కూటమిలోనే అలజడి మొదలైంది. ఇదే నిజమైతే అమెరికా ఏకఛత్రాధిపత్యానికి తూట్లు పడినట్లే. బలమైన రక్షణ బంధం కలిగిన దేశాలతోనూ ట్రంప్ ప్రతికూలంగా వ్యవహరిస్తే మాత్రం ప్రపంచ శాంతికి అది భంగకరంగానే పరిణమిస్తుందన్నది ఎంతైనా వాస్తవం.
చైనా, రష్యాలు దూసుకొస్తాయా?
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ సారథ్యానికి అమెరికా స్వస్తి పలుకుతోందనడానికి సంకేతాలా? ఎవరితోనూ తమకు సంబంధం లేదన్న రీతిలో కొత్త అధ్యక్షుడు వ్యవహరిస్తే అది కచ్చితంగా అమెరికా ప్రాభవానికి, ప్రాబల్యానికి గొడ్డలి పెట్టే అవుతుంది. ఇదే జరిగితే అమెరికా స్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో చైనా లేదా రష్యాలు భర్తీ చేసే అవకాశం ఉందా అన్నది ఆసక్తి కలిగించే అంశమే! ఆర్థికంగా చైనా ఇప్పుడు తిరుగులేని శక్తి. ప్రపంచ మార్కెట్‌ను కమ్మేస్తోంది. అపారమైన విదేశీ వాణిజ్య మిగులుతో అమెరికాను సైతం గడగడలాడిస్తోంది. ఇంత ఆర్థిక సత్తా లేకపోయినా రష్యాకు పూర్వవైభవం తేవాలన్న తపన ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌లో బలంగా ఉంది. ట్రంప్ స్వయంకృతాలు కల్పించే అవకాశాన్ని ఈ రెండు దేశాల్లో ఏది అందుకుంటుందన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేకపోయినా సమీప భవిష్యత్‌లో ఇది వాస్తవమేనన్నది ఎంతైనా నిజం.

అధ్యక్షులు 45మంది..
ప్రమాణ స్వీకారాలు 70

తొలిసారిగా 1789లో జార్జి వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టారు. అంటే ట్రంప్‌తో కలుపుకుని 70 సార్లు అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారాలు జరిగాయన్నమాట. ట్రంప్ 45వ అధ్యక్షుడు అయినప్పుడు 70 సార్లు ప్రమాణ స్వీకారం చేయడమన్నది ఆసక్తి కలిగించే అంశమే. అన్ని ప్రజాస్వామ్య దేశాల మాదిరిగానే పూర్తిస్థాయిలో అమెరికా అధ్యక్షుడు అన్నివేళలా కొనసాగే అవకాశం ఉండదు. ఆయా పరిస్థితుల ప్రభావం వల్ల రాజీనామా చేయాల్సి రావడమో, అనివార్య పరిస్థితుల్లో తప్పుకోవడమో జరగడం వల్ల 70 సార్లు ప్రమాణ స్వీకారాలు అవసరమయ్యాయి.

ఇక రక్షిత వాదమే

స్వేచ్ఛా విపణి అమెరికా ఆశయం. వాణిజ్యపరంగా దేశాల మధ్య ఎలాంటి అవరోధాలు ఉండకూడదన్నది దీర్ఘకాలంగా దాని లక్ష్యం. కాని డొనాల్డ్ ట్రంప్ దీనికి తిలోదకాలు ఇవ్వబోతున్నారు. సరికొత్త రీతిలో ‘బై అమెరికా.. హైర్ అమెరికా’ అంటూ స్వదేశీ నినాదాన్ని అందుకున్నారు. ఎన్నికల సమయంలో ఈ దిశగా ఆయన చేసిన ప్రకటనలు కేవలం మాటలే అనుకుంటే పొరపాటే. దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలోనూ ఆయన ఇదేమాట అన్నారు. అంటే ఇప్పటివరకు ఉన్న అమెరికా వేరు... ట్రంప్ హయాంలో కొత్త మార్పులు సంతరించుకుంటున్న అమెరికా వేరు. అంటే స్వేచ్ఛా విపణికి అమెరికా దాదాపుగా దూరం కాబోతోందన్నమాట. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ఎంతగా విస్తరిస్తే ఎంతగా అవరోధాలు లేకుండా ఉంటే అంతగానూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలసిల్లుతుంది. రక్షిత వాదమే అభివృద్ధి వేదమనుకుంటే దేశాల మధ్య ఎగుమతులకు ఆస్కారం ఉండదు. సరికొత్త స్వదేశీ రక్షిత వాదాన్ని తెరపైకి తెచ్చిన ట్రంప్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే గణనీయంగా ఉంటుంది.

రికార్డులే రికార్డులు

కేవలం మొదటిసారే అన్న పదం గత అధ్యక్షులకు ఒకేసారి వర్తిస్తే, కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ది మాత్రం అనితర సాధ్యమైన ‘తొలి’ రికార్డే. ఎందుకంటే ఇన్ని రకాల ‘్ఫస్ట్’లను ఇంతవరకు వచ్చిన ఏ అధ్యక్షుడు సాధించలేదు. ఇంతవరకు కూడా అమెరికా అధ్యక్షులందరూ రాజకీయ జీవితం నుంచి ఈ సమున్నత పదవికి చేరుకున్నవారే. కానీ ట్రంప్ జీవితం వీటికి అతీతంగానే సాగింది. ఫక్తు వ్యాపారవేత్తగానే ఏడుపదుల జీవితాన్ని ఆయన సాగించి ఊహించని రీతిలో అధ్యక్షుడైపోయారు. రొనాల్డ్ రీగనే 69వ ఏట అధ్యక్షుడై రికార్డును సాధిస్తే, 70వ ఏట ఈ పదవిని చేపట్టి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతేకాదు, హోటళ్ళు, కేసినోలు, గోల్ఫ్‌కోర్సులు నిర్వహించిన వ్యక్తి. అలాగే రియాల్టీ షోలూ నిర్వహించిన వ్యక్తి అధ్యక్షుడు కావడమన్నది ట్రంప్‌తోనే మొదలు. అలాగే, అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ అత్యంత సంపన్నుడే కాదు, బిలియనీర్‌గా ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. దేశాన్ని పాలించే వ్యక్తులు అన్నివిధాలుగా నీతి నిజాయితీలకు, రాజ్యాంగ నిబద్ధతకు అంకితమై ఉండాలి. అంటే తమమీద ఏరకమైన మచ్చ లేకుండా చూసుకోవాలి. కానీ ట్రంప్ తీరే వేరు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ట్రంప్ తన ఆదాయ రిటర్న్స్‌ను దాఖలు చేయని తొలి వివాదాస్పద వ్యక్తిగా సరికొత్త రికార్డే సృష్టించారు. అలాగే సొంతంగా ఎయిర్‌లైనర్ ఉన్న ఏకైక అధ్యక్షుడు కూడా ట్రంపే. అలాగే తన మనసులోని మాటను అది ఎలాంటిదైనా నిర్మొహమాటంగా చెప్పగలిగే స్థాయి ఉన్న వ్యక్తి కూడా ట్రంపే. ఎన్నికల ప్రచార సమయంలోనే తనకు చాలామంది మహిళలతో సంబంధం ఉందని బాహాటంగా చెప్పి ఈ విధంగానూ వివాదాలు సృష్టించవచ్చని ట్రంప్ నిరూపించాడు. అన్నిటికంటే మించి ఆరుసార్లు తన కంపెనీలు దివాలా తీసినట్లు ప్రకటించిన తొలి అధ్యక్షుడు కూడా ట్రంపే.

భారత్‌తో సఖ్యత?
అమెరికాలో అధికారంలో వున్నది రిపబ్లికన్లు అయినా, డెమోక్రాట్లు అయినా వారి వారి ఆలోచనలను బట్టి ఇతర దేశాల పట్ల అనుసరించే విధానాలు ఆధారపడి ఉంటాయి. దక్షిణాసియాకు సంబంధించినంత వరకు అతి పెద్ద దేశం భారత్. భారత్‌తో అమెరికా అధ్యక్షులందరూ కూడా సన్నిహిత సంబంధాలనే కోరుకుంటూ వచ్చారు. రిపబ్లికన్లు అయినా డెమోక్రాట్లు అయినా పలుమార్లు భారత్‌లో పర్యటనలు జరిపి తమ ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా బరాక్ ఒబామా భారత్‌ను సందర్శించినన్ని సార్లు ఏ అధ్యక్షుడూ అతి తక్కువ వ్యవధిలో రాలేదన్నది ఎంతైనా వాస్తవం. మన్మోహన్‌సింగ్‌తోనూ, నరేంద్ర మోదీతోనూ అత్యంత సన్నిహితంగా మెసిలిన వ్యక్తి బరాక్ ఒబామా. ఆయన డెమోక్రాట్ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే వ్యవహరించారనుకున్నా ఇప్పటి రిపబ్లికన్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠను రేకెత్తించేదే. పాకిస్తాన్ కంటే కూడా భారత్‌కే ఎక్కువగా వత్తాసు పలికిన ఇతర అధ్యక్షులు మాదిరిగానే ట్రంప్ వ్యవహరిస్తారా? బరాక్ ఒబామా మాదిరిగానే నరేంద్ర మోదీతో అదే రకమైన సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తారా అన్నది వేచిచూడాల్సిందే. ముఖ్యంగా వీసాలు, ఔట్‌సోర్సింగ్‌లకు సంబంధించి అమెరికా ఫస్ట్ అంటూ తన అధ్యక్ష ప్రసంగంలో స్పష్టం చేసిన ట్రంప్, అదే రీతిలో వ్యవహరిస్తే మాత్రం భారత ఐటి పరిశ్రమలకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందన్నది వాస్తవం. ఇప్పటివరకు అమెరికాతో భారత్ కుదుర్చుకున్న అన్ని రకాల ఒప్పందాల్లో పౌర అణుఇంధన ఒప్పందం అత్యంత కీలకమైంది. జార్జిబుష్ హయాంలో జరిగిన ఈ ఒప్పందం బరాక్ ఒబామా ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. మరి డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో అనుసరించే విధానం ఏ విధంగా ఉండబోతోంది అన్న దానిపైనే తదుపరి ఒప్పందాలు ఆధారపడి ఉంటాయి. రక్షిత వాదమే అమెరికాకు రక్ష అని భావించే పక్షంలో అనేక దేశాలకు అగ్రరాజ్యం దూరమయ్యే పరిస్థితి అనివార్యమవుతుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలతో సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఎంతైనా అవసరం.

- బి. రాజేశ్వర ప్రసాద్