అమృత వర్షిణి

పాము జాడ లేని ఐర్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూగోళం జీవ వైవిధ్యానికి నిలయం. ఎక్కడ చూసినా అనేక రకాల పక్షులు, జంతువులు, క్రిమి కీటకాలు, ఉభయచర జీవులు ఎన్నో కనిపిస్తాయ. వీటితో పాటు పాములు కూడా కనిపిస్తాయి. భయంకరమైన విష సర్పాలతో పాటు, విషం లేని పాములు కూడా కనిపిస్తాయి. అయితే ఐర్లాండ్ దేశంలో మాత్రం మనకి ఒక్క పాము కూడా కనిపించదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సెయింట్ పాట్రిక్ అనే మత బోధకుడు ఐర్లాండ్ నేల మీద నుండి పాములన్నింటినీ తొలగించాడని అంటారు.
ఐర్లాండ్ నార్త్ అట్లాంటిక్, గ్రేట్ బ్రిటన్‌ల పొరుగున ఉంది. ఐర్లాండ్ జన సంఖ్య అరవై మూడు లక్షల డెబ్భై ఎనిమిది వేలు. ఇక్కడ మనకు అనేక రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి గానీ, ఎక్కడా ఒక్క పాము కూడా కనిపించదు. ఐదవ శతాబ్దానికి చెందిన బిషప్ సెయింట్ పాట్రిక్ నిజానికి బ్రిటిష్ దేశస్థుడు. అయితే అతనికి పదహారేళ్ల వయసు ఉన్నప్పుడు కొంత మంది పైరేట్లు అతన్ని ఐర్లాండ్ తీసుకొచ్చేసారు. అక్కడే పెరిగి పెద్దవాడైన అతను తర్వాత దైవ సంబంధిత జీవనంలోకి మరలిపోయాడని ఓ కథనం. అతను ఐర్లాండ్ నుండి సర్పాలను బహిష్కరించడానికి కారణం క్రైస్తవం ప్రకారం పాములు దుష్టశక్తులకు ప్రతీక కనుక వాటిని ఐర్లాండ్ నుండి తరిమివేసాడని కొంత మంది చెబుతుంటారు. జుడియో క్రిస్టియన్ సంప్రదాయంలో పాములను వారు సహించరు. ఈ కారణంగానే సెయింట్ పాట్రిక్ పాములను ఐర్లాండ్ నుండి తరిమివేసినట్లు చెబుతారు. అయితే దీనికి ఎటువంటి ఆధారం లేదని ఐర్లాండ్‌లోని నేషనల్ మ్యూజియం కీపర్ నిగిల్ మోనాఘన్ అంటున్నారు. అనేక సంవత్సరాల నుండి ఐర్లాండ్‌లో జంతు శిలాజాలను, రికార్డులను మోనాఘన్ సేకరిస్తున్నాడు. అయితే ఐర్లాండ్‌లో ఎప్పుడూ పాములున్నట్లు గానీ, అవి సంచరించినట్లు గానీ ఆధారాలు లేవని చెబుతున్నాడు. అలాగే లూసియానా పాయిజన్ సెంటర్ డైరెక్టర్ మార్క్ ర్యాన్ కూడా ఐర్లాండ్‌లో ఎక్కడా మనకు పాములు కనిపించవని, దీనికి కారణం ఐర్లాండ్ అత్యంత శీతల దేశం కనుక, ఇక్కడ పాములు నివసించడానికి వీలైన పరిస్థితులు లేవని అంటున్నాడు. ఐస్ ఏజ్ సమయంలో ఊహించరానంత మంచు ఐర్లాండ్‌తో పాటు చుట్టుపక్కల దేశాలను ముంచెత్తింది. అది సంవత్సరాల తరబడి అక్కడ పేరుకుపోయింది. తర్వాత ఆ మంచు కరిగినా, ఐర్లాండ్ యూరప్‌తో విడివడింది. ఆ రెండింటికీ మధ్య పనె్నండు మైళ్ల దూరం పెరిగిపోయింది. మధ్యలో జలరాశులు పేరుకుపోయాయి. మరో పక్క స్కాట్లాండ్ ఉన్నా అది కూడా అత్యంత శీతలమైనది. ఈ కారణంగా పాములు ఐర్లాండ్‌లో మనలేకపోయాయని పలువురు సైంటిస్టులు నిర్ధారిస్తున్నారు. ఇకపోతే న్యూజీలాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో కూడా పాములు లేవని అంటున్నా అక్కడ కొన్నిచోట్ల కొన్నిసార్లు పాములు కనిపించాయని అంటారు. అయితే అవి ఇతర ప్రాణులకు హానిచేసే జాతికి చెందినవి కాదని, అవి చిన్నచిన్న జలసర్పాల వంటివని అంటున్నారు. ఈ రకంగా చూస్తే పూర్తిగా పాములు కానరాని దేశం ఐర్లాండేనని చెప్పక తప్పదు.

- దుర్గాప్రసాద్ సర్కార్