తెలంగాణ

10నుంచి బడ్జెట్ సమావేశాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయమై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇదివరకే రెండుసార్లు తేదీలు అనుకున్నా, ఆ తేదీల్లో సమావేశాలు నిర్వహించేందుకు వీలుకుదరలేదు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంది.
మార్చి 31వ తేదీలోగా ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాధారణంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభమై, మార్చి నెలాఖరున ముగిసేవి. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలను వెరైటీగా జనవరి 27న ప్రారంభించాలనుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలకంటే ముందే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించాలనుకున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఫిబ్రవరి 15న ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడు సమ్మక్క- సారక్క జాతర, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు రానుండటం వంటి కారణాలతో చివరకు మార్చి 10వ తేదీ నుంచి నిర్వహించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 16 పని దినాలు ఉండేలా అజెండా ఖరారులో సంబంధిత అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదం కోసం ప్రతిపాదిస్తుంది.