Others

యాజ్ఞసేని 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి ద్రుపదుని బలాన్ని అణచివేద్దామని తలపోశారు.
ఈ బ్రాహ్మణునితో మనకేమి పని. అతడు చేసిన తప్పేమిటి? రాజులందరినీ మోసం చేసిన ద్రుపదుని వదలగూడదు అని ద్రుపదునిపైకి దండెత్తి రాగా ద్రుపదుడు భయపడి బ్రాహ్మణుల చాటున చేరాడు.
అది చూచిన అర్జునుడు- ‘‘నా అస్త్రంచే ద్రుపదుడిపై దండెత్తిన శత్రువులను అణచివేస్తాను. మీరు ప్రక్కకు తొలగి చూస్తుండండి’’ అని అన్నాడు.
అని శత్రు సైన్యంపై లెక్కలేనన్ని బాణాలను వేశాడు. అప్పుడు అర్జునుని వెంటనున్న భీముడు (్భమసేనుడు) పూనుకొని దగ్గరలోనున్న ఒక చెట్టును పెకలించి దండాయుధాన్ని ధరించిన యమ ధర్మరాజువలె అర్జునుడికి సహయకారిగా నిలిచాడు.
భీమార్జునుల విజృంభణం చూచిన శ్రీకృష్ణుడు ఆశ్చర్యపడి బలరామునితో ‘‘అన్నా! తాటిచెట్టువలె పెద్ద విల్లును ధరించి శత్రువులను తరముముచున్నవాడు అర్జునుడు. అతని ప్రక్కనే వృక్షాన్ని చేపట్టి యున్న వీరుడు భీమసేనుడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టగనే వెళ్లిపోయిన ఆ పసుపుచ్చ వనె్నగాడు ధర్మరాజు. అతడి వెంట వెళ్లిన సూర్య సమాన తేజులిద్దరూ నకుల సహదేవులు’’ అని అన్నాడు.
‘‘లక్క యింటిలో నిప్పుమంటనుండి వీరెట్లు బ్రతికి బయటపడ్డారో? ఈ అయిదుగురిని చూచాను. ఇది ఎంతో సుదినం’’ అని బలరాముడు సంతోషించాడు.
శ్రీకృష్ణునికి అర్జునుని బలం తెలుసు గనుక అతడు బలరామునితో ‘‘నీవు తొందరపడనవసరం లేదు. అర్జునుడు ఒక్కడే సురాసురులంతా ఎత్తివచ్చినా వారిని జయిస్తాడు. ఈ మానవమాత్రులొక లెక్కా? ఒకవేళ అర్జునుడే మనలను సాయం అడిగితే చూద్దాం! అయినా పాండు సుతునికి ఎప్పుడూ పరాజయం కలుగదు!’’ అని అన్నాడు.
భీమార్జునులు కర్ణుడు మొదలైనవారిపై బడ్డారు. అంతలో కర్ణుడు అర్జునుడితో తలపడ్డాడు. మద్రరాజైన శల్యుడు భీముని ఎదుర్కొన్నాడు. తీక్షణమైన తేజస్సుగల బాణాల వేగానికి కర్ణుడు అతి కష్టంమీద అర్జునుని ఎదిరిస్తున్నాడు. అర్జునుడు అన్నాడు ‘‘కర్ణ మహాశయా! నన్ను ఎదిరించి నిలువుము. లేనిచో మరలిపొమ్ము!’’ అన్నాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలోనున్న అర్జునుడితో.. ‘‘విప్రోత్తమా! నిన్ను ఎదిరించాలంటే సాక్షాత్తూ ఇంద్రుడైనా రావాలి లేదా అర్జునుడైనా రావాలి! అంతేగాని మరొకరికి అసాధ్యం!’’ అన్నాడు కర్ణుడు.
దానికి సమాధానంగా అర్జునుడు కర్ణునితో- ‘‘కర్ణా! ధనుర్వేత్త, ప్రతాపవంతుడైన పరశురాముడిని కాదు! యుద్ధంలో శ్రేష్ఠుడనై అస్తశ్రస్త్రాలు తెలిసిన బ్రాహ్మణుడను. బ్రహ్మాస్త్రం, ఐంద్రాస్త్రం నిష్ఠగా గురూపదేశంతో పొందాను. నిన్ను జయించటానికి యుద్ధంలో నిలిచాను. స్థిరపడుము’’ అని అన్నాడు.
ఆ మాటలను విన్న కర్ణుడు బ్రహ్మ తేజస్సు జయింపశక్యం కానిది అని భావించి ‘‘బ్రాహ్మణోత్తమా! నీ తేజస్సు అమోఘం! జయింపరానిది’’ అని వెనుదిరిగాడు.
మరొక చోట శల్యభీములు ఒకరితోనొకరు తలపడ్డారు. భీకరంగా కొట్టుకున్నారు. అంతలో భీముడు చేతులతో శల్యుని ఎత్తి నేలమీద కొట్టాడు. అక్కడున్న బ్రాహ్మణులంతా నవ్వుకొన్నారు.
కర్ణునికి శల్యునికి జరిగినదానికి శంకించిన రాజులందరూ భీముని చుట్టుముట్టారు.
‘‘పరశురాముడు, ద్రోణుడు, అర్జునుడు తప్ప యుద్ధంలో కర్ణుని ఎదిరించలేరు. మహాబలవంతుడైన శల్యుని యుద్ధంలో పడగొట్టడానికి బలరాముడో, భీముడో, దుర్యోధనుడో కావాలి. ఇతరులకు అసాధ్యం. ఇక బ్రాహ్మణులతో యుద్ధం ముగించండి. అపరాధం చేసినా బ్రాహ్మణులు నిత్యమూ రక్షింపదగినవారు!’’ అని రాజులందరూ అన్నారు.
బ్రాహ్మణ వేషంలో యున్న భీమార్జునులు అప్పుడు శాంతించారు.
అంత శ్రీకృష్ణుడు లేచి ఆ రాజులతో ‘‘ద్రుపద కన్య వారికి ధర్మపూర్వకంగా లభించింది. కావున యుద్ధం ఆపండి’’ అని అన్నాడు.
రాజులందరూ ప్రశాంత చిత్తులై అక్కడినుండి మరలి వెళ్లిపోయారు. జనసమ్మర్దం నుండి విముక్తులై, శత్రువుల చూస్తుండగా భీమార్జునులిద్దరూ అతి కష్టంమీద ద్రౌపదిని తమ వెంట నిడుకొని వెళ్లారు. కుమ్మరి యింట్లో ప్రవేశించారు.
‘‘అమ్మా! మేమొక భిక్ష తెచ్చాము’’ అని తల్లి కుంతీదేవికి విన్నవించారు.

- ఇంకావుంది

- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము