తెలంగాణ

‘హోదా’పై మాటతప్పితే తీవ్ర పరిణామాలు: బాలకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఎపికి అయిదేళ్లు కాదు, పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బిజెపి నేతలు గొప్పగా మాట్లాడారని, నేడు హోదా గురించి అడిగితే కాదంటున్నారని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ఆయన గురువారం ఉదయం మీడియాతో కాసేపు మాట్లాడుతూ బిజెపి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోదా గురించి ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండాలని తాను గతంలోనే చెప్పానని, పౌరుషం విషయంలో తెలుగుప్రజలు ఎవరికీ తీసిపోరన్నారు. హోదా ఇస్తామన్న వారు మాట తప్పితే రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు.