తెలంగాణ

బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి , డిసెంబర్ 4: బిసి సబ్‌ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌కు 10వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసి కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి బిసి నిరుద్యోగ యువతకు రుణాలు ఇవ్వాలని, బిసిలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే రూ.51వేలను లక్ష రూపాయలకు పెంచాలన్నారు. బిసిలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 14నుండి 16వరకు తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఫీజుల నియంత్రణకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకరావాలన్నారు.