తెలంగాణ

భవిత బంగారమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ విజన్ ఉన్న ప్రభుత్వం
ఆదాయం వేగంగా పెరుగుతోంది
మీడియా సమావేశంలో మంత్రి ఈటల

హైదరాబాద్, మార్చి 14: అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని, గణాంకాలు ఇది నిరూపిస్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శాసన సభలో 2016-17 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత అసెంబ్లీ కమిటీ హాలులో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్తు చీకటిమయం అవుతుంది, పాలించలేరంటూ ప్రచారం చేశారని, అయతే తెలంగాణ వెనకబడిన ప్రాంతం కాదు.. ఉద్దేశ పూర్వకంగా వెనకపడేసిన ప్రాంతమని ఉద్యమ కాలంలో చెప్పాం.. ఇప్పుడది నిజమని తేలిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఆదాయం గణనీయంగా పెరిగిందని, భవిష్యత్తులో మరింతగా పెరుగుతుందన్నారు. వేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల రైతుల పరిస్థితి కూడా మెరుగు పడుతుందన్నారు. విడిపోదాం, అభివృద్ధి చెందుదామని ఉద్యమ సమయంలో చెప్పాం. చెప్పినట్టుగానే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నామన్నారు. మూస పద్ధతిలో కాకుండా కొత్త తరహాలో బడ్జెట్ రూపకల్పన చేసినట్టు చెప్పారు. రెవెన్యూ మిగులు రాష్ట్రంగా తెలంగాణను 14వ ఆర్థిక సంఘం గుర్తించిందన్నారు. ప్రణాళిక వ్యయం ఎక్కువ చూపించిన రాష్ట్రాలు దేశంలో ఐదు ఉన్నాయని, అందులో తెలంగాణ ఒకటి అన్నారు. ప్లాన్ బడ్జెట్ 67వేల 637 కోట్ల రూపాయలు కాగా, నాన్ ప్లాన్ బడ్జెట్ 62వేల 783 కోట్ల రూపాయలని తెలిపారు. అపోహలను, అనుమానాలను తొక్కిపడేసి అభివృద్ధి పథంలో వెళుతున్న రాష్ర టమన్నారు. తెలంగాణ ప్రభుత్వం విజన్ ఉన్న ప్రభుత్వమని చెప్పారు. దేశంలో సగటు జిడిపి 8.6శాతం అయితే తెలంగాణ జిడిపి 11.7శాతం అని తెలిపారు. వ్యవసాయం తిరోగమన అభివృద్ధి రేటులో ఉన్నా, కరువు ఉన్నా అభివృద్ధి సాధించినట్టు చెప్పారు. ఐటి, ఉత్పత్తి రంగాలు ప్రపంచంలో అత్యున్నత స్థానంగా హైదరాబాద్‌ను చూస్తున్నాయని తెలిపారు. అన్ని వసతులు ఉన్నాయి, విద్యుత్, నీరు, భూమి అవసరం అయినంత ఉందని దీని వల్ల ప్రపంచంలో పారిశ్రామిక రంగం హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 2016-17లో గణనీయమైన ప్రగతిని సాధిస్తామని, వేగంగా ముందుకు వెళతామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఐదు ప్రాధాన్యత అంశాలను గుర్తించినట్టు చెప్పారు. సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, వైద్యం, విద్యుత్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నా, పేదల సంఖ్య ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులను మానవ సంపదగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. ముస్లింలకు ప్రత్యేకంగా 70 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి వంద కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి వంద కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించినట్టు చెప్పారు. ఇంకా 65-70 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా రీ డిజైనింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 26వేల కోట్లకు పైగా నిధులు బడ్జెట్‌లో కేటాయించినట్టు తెలిపారు. బోర్లు పడక పోవడం, మోటర్లు కాలిపోవడం వంటి వాటితో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రాజెక్టులు పూర్తి చేయడమే ఈసమస్యకు పరిష్కారమని అన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి హడ్కో నుంచి రుణం పొందనున్నట్టు చెప్పారు. అదే విధంగా కొన్ని బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వనున్నాయని ఈటల రాజేందర్‌తెలిపారు. మిషన్ భగీరథను కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసి అవసరమైన నిధులు రుణంగా పొందనున్నట్టు చెప్పారు. వీటిని బడ్జెట్‌లో చూపించలేదని ఆర్థిక సంస్థల ద్వారా నిధులు సమకూర్చుకుంటామని చెప్పారు. అతి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందుతున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల తక్కువ వడ్డీ రేటుకు రుణం లభిస్తుందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా బంజారాహిల్స్‌లోని ఇంటికి, చెంచు పెంటలో నివసించే వారికి సమానంగా మంచినీళ్లు లభిస్తాయని తెలిపారు.
నీటిపారుదల రంగానికి గత సంవత్సరం ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఏడువేల కోట్ల రూపాయల వ్యయం చేసినట్టు చెప్పారు. 25వేల కోట్ల భారీ నిధులను నీటిపారుదల రంగానికి ఖర్చు చేస్తామని అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణ వైపు వేగంగా అడుగులు వేయించే విధంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు ఈటల రాజేందర్ తెలిపారు. కరవు నివారణ చర్యలకు కేంద్రం ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి నిధులు ఇస్తుందని, అదే విధంగా రాష్ట్రం కొంత కేటాయించి చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. బడ్జెట్‌ను వంద శాతం నిధులు ఖర్చు చేయడం అరుదుగా జరుగుతుందని, 85 నుంచి 95శాతం వరకు నిధులు వ్యయం చేస్తారని ఈటల తెలిపారు.