విశాఖపట్నం

బీభత్సం సృష్టించిన బస్సు..పరుగులు తీసిన జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒకరి మృతి, 4గురికి గాయాలు
* జనం మీదకు దూసుకొచ్చిన బస్సు
విశాఖపట్నం, డిసెంబర్ 27: నగరంలో ఓ ప్రైవేటు బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో రైతుబజారులోని జనం మీదకు దూసుకు వచ్చింది. దీంతో జనం పరుగులు తీశారు. ఆదివారం ఉదయం అక్కయ్యపాలెం నరసింహనగర్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైతుబజారు నుంచి హైవే వైపు వస్తున్న ఆదిత్య టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో రైతుబజారు ముఖ ద్వారం వైపునకు దూసుకువచ్చింది. రైతు బజారు వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తున్న అప్పన్న (47)ను, మరో నలుగురిని ఢీకొంది. ఈ సంఘటనలో అప్పన్న అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన నలుగురు గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో సిఐ ఎన్‌వి ప్రభాకర్ అతన్ని వైద్య చికిత్స నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. అదే సమయంలో రైతుబజారు వద్ద పార్కింగ్ చేసిన వాహనాలను బస్సు ఢీకొని నిలిచిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రెండు కార్లు, రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.